Menu Close

Chigurakulalo Chilakamma Lyrics In Telugu – Donga Ramudu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Chigurakulalo Chilakamma Lyrics In Telugu – Donga Ramudu

ఓ ఓ ఓ ఓ… చిగురాకులలో చిలకమ్మ…
చిన్న మాట వినరావమ్మ…
ఓ ఓ ఓ ఓ… మరుమల్లెలలో మావయ్య…
మంచి మాట సెలవీవయ్య…

పున్నమి వెన్నెల గిలిగింతలకు… తూగిన మల్లెల మురిపాలు
నీ చిరునవ్వుకు సరికావమ్మ… ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ… చిగురాకులలో చిలకమ్మ

ఎవరన్నారో ఈ మాట… వింటున్నాను నీ నోట
తెలిసీ పలికిన విలువేలా… ఆఆ ఆ ఆ
ఓ ఓ ఓ ఓ… మరుమల్లెలలో మావయ్య

వలచే కోమలి వయ్యారాలకు
కలసే మనసుల తియ్యదనాలకు
కలవా విలువలు… సెలవీయ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ… చిగురాకులలో చిలకమ్మ

పై మెరుగులకే… భ్రమపడకయ్య
మనసే మాయని… సొగసయ్య
గుణమే తరుగని… ధనమయ్య, ఊఊ ఊ ఊ

ఓ ఓ ఓ ఓ… మరుమల్లెలలో మావయ్య…
మంచి మాట సెలవీవయ్య…
ఓ ఓ ఓ ఓ… చిగురాకులలో చిలకమ్మ…
చిన్న మాట వినరావమ్మ…

Like and Share
+1
2
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading