Menu Close

Chiguraku Chatu Chilaka Song Lyrics in Telugu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

చిగురాకు చాటు చిలక… ఈ అలజడి ప్రేమేగా
అలవాటు లేదు గనక… మది సులువుగ నమ్మదుగా
చిగురాకు చాటు చిలక… తను నడవద ధీమాగా
అనుకోని దారి గనక… ఈ తికమక తప్పదుగా…

తను కూడా నాలాగా… అనుకుంటే మేలేగా…
అయితే అది తేలనిదే… అడుగు పడదుగా… ఆ
సరికొత్తగ నా వంకా… చూస్తోందీ చిత్రంగా…
ఏమైందో స్పష్టంగా… బయట పడదుగా…

చిగురాకు చాటు చిలక… ఈ అలజడి ప్రేమేగా
అలవాటు లేదు గనక… మది సులువుగ నమ్మదుగా…

చెప్పకు అంటూ… చెప్పమంటూ చర్చ తేలేనా…
తప్పనుకుంటూ తప్పదంటూ తర్కమాగేనా…
సంగతి చూస్తూ… జాలి వేస్తూ కదలలేకున్నా…
తేలని గుట్టు… తేనెపట్టు కదపలేకున్నా

ఒణికే నా పెదవుల్లో… తొణికే తడిపిలుపేదో…
నాకే సరిగా ఇంకా తెలియకున్నదీ…ఈ
తనలో తను ఏదేదో… గొణిగి ఆ కబురేదో…
ఆ వైనం మౌనంలో… మునిగి ఉన్నది…

చిగురాకు చాటు చిలక… ఈ అలజడి ప్రేమేగా
అనుకోని దారి గనక… ఈ తికమక తప్పదుగా…

ఎక్కడినుంచో మధురగానం… మదిని మీటింది…
ఇక్కడినుంచే నీ ప్రయాణం… మొదలు అంటోందీ…ఈ
గలగల వీచే… పిల్లగాలి ఎందుకాగింది…
కొంపలు ముంచే… తుఫానొచ్చే సూచనేమో ఇదీ…ఈ

వేరే ఏదో లోకం… చేరే ఊహల వేగం…
ఏదో తియ్యని మైకం పెంచుతున్నదీ…ఈ
దారే తెలియని దూరం… తీరే తెలపని తీరం…
తనలో కలవరమేదో రేపుతున్నది…

చిగురాకు చాటు చిలక… ఈ అలజడి ప్రేమేగా
అలవాటు లేదు గనక… మది సులువుగ నమ్మదుగా
చిగురాకు చాటు చిలక… తను నడవద ధీమాగా
అనుకోని దారి గనక… ఈ తికమక తప్పదుగా…

తను కూడా నాలాగా… అనుకుంటే మేలేగా…
అయితే అది తేలనిదే… అడుగు పడదుగా… ఆ ఆ
సరికొత్తగ నా వంకా… చూస్తోందీ చిత్రంగా…
ఏమైందో స్పష్టంగా… బయట పడదుగా…

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading