ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Chethilona Cheyyesi Song Lyrics In Telugu – Bombay Priyudu
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా… నను ఎన్నడూ విడిపోనని…
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయ్యవా… నను వీడని జత నీవని…
ఆ ఆ ఆఆ ఆఆ… ఆ ఆ ఆఆ ఆఆ…
చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా… నను ఎన్నడూ విడిపోనని…
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయ్యవా… నను వీడని జత నీవని…
ప్రతిక్షణం ప్రేమలో… పరీక్షలే వచ్చినా…
తలరాతకు తలవంచదు ప్రేమ…. ఆ ఆ…
చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా… నను ఎన్నడూ విడిపోనని…
నీవు నేనులే మనస్సు ఒక్కటే… ఇద్దరైన ఈ మమకారంలో
నీవు నేననే పదాలు లేవులే… ఏకమైన ఈ ప్రియమంత్రంలో
నా గుండెలో కోకిల… నీ గొంతులో పాడగా…
నా జన్మ ఓ పూవులా… నీ కొమ్మలో పూయగా…
కల ఇలా కౌగిలై… తనే కలే వెన్నెలై…
చేయి కలిపిన చెలిమే అనురాగం… ఆ ఆ…
చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా… నను ఎన్నడూ విడిపోనని…
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయ్యవా… నను వీడని జత నీవని…
నిన్నుతాకితే దేవతార్చన… పూజలందుకో పులకింతల్లో…
వాలు చూపులే వరాల దీవెన… నన్ను దాచుకో కనుపాపల్లో…
నా ప్రేమ గీతానికి… నీవేలే తొలి అక్షరం…
నా ప్రేమ పుట్టింటికి… నీవేలే దీపాంకురం…
రసానికో రాగమై… రచించని కావ్యమై…
చేయి కలిపిన చలవే అనుబంధం… ఆ ఆ…
చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా… నను ఎన్నడూ విడిపోనని…
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయ్యవా… నను వీడని జత నీవని…