Menu Close

Cheppalani vundi Lyrics in Telugu – Rudraveena


Cheppalani vundi Lyrics in Telugu – Rudraveena

ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనే గద గుండె బలం తెలిసేది
దు:ఖానికి తలవంచితే తెలివి కింక విలువేది
మంచైనా చెడ్డైనా పంచుకోను నేలేన
ఆ మాత్రం ఆత్మీయతకైనా పనికిరానా
ఎవ్వరితో ఏ మాత్రం పంచుకోను వీలులేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటండి

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

గుండెల్లో సుడి తిరిగే కలత కథలూ
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

కోకిలల కుటుంబంలో చెడ బుట్టిన కాకిని అని

అయినవాళ్ళు వెలివేస్తే అయినా నేనేకాకిని
కోకిలల కుటుంబంలో చెడ బుట్టిన కాకిని అని
అయినవాళ్ళు వెలివేస్తే అయినా నేనేకాకిని

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

పాట బాట మారాలని చెప్పటమేనా నేరం

గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం
వసంతాల అందం విరబుసే ఆనందం
తేటి తేనె పాట పంచెవన్నెల విరితోట
వసంతాల అందం విరబుసే ఆనందం
తేటి తేనె పాట పంచెవన్నెల విరితోట

బ్రతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట

మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళబాట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళబాట

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

ఏటి పొడుగునా వసంతమొకటేనా కాలం

ఏదీ మరి మిగతా కాలాలకు తాళం
నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు
కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు
మంచు వంచెనకు మోడై గోడు పెట్టు వాడొకడు
వీరి గొంతులోని కేక వెనుక ఉన్నదే రాగం
అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ నాదం
అని అడిగిన నా ప్రశ్నకు అలిగి మత్త కోకిల

కళ్ళు ఉన్న కబోదిలా చెవులు ఉన్న బధిరుడిలా

నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం
కాదన్నందుకు అక్కడ కరువాయెను నా స్థానం

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

అసహాయతలో దడ దడ లాడే హృదయమృదంగ ధ్వానం

నాడుల నడకల తడబడి సాగే అర్తుల ఆరని శోకం
ఎడారి బతుకుల నిత్యం
చస్తూ సాగే బాధల బిడారు
దిక్కు మొక్కు తెలియని
దీనుల యదార్థ జీవన స్వరాలు

నిలువునా నన్ను కమ్ముతున్నాయి

శాంతితో నిలువనీయకున్నాయి
ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరిచెయ్యాలి
జన గీతిని వద్దనుకుంటూ
నాకు నేనే పెద్దనుకుంటూ
కలలో జీవుంచను నేను కలవరింత కోరను నేను

నేను సైతం విశ్వవీణకు
తంతినై మూర్ఛనలుపోతాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి
గొంతుక విచ్చి మోస్తాను
నేను సైతం ప్రపంచాధ్యపు
తెల్ల రేకై పల్లవిస్తాను
నేను సైతం నేను సైతం…
బ్రతుకు బాటకు గొంతు కలిపేను
నేను సైతం నేను సైతం…
బ్రతుకు బాటకు గొంతు కలిపేను

సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించుదాకా
ప్రతి మనిషికి జీవనంలో నందనం వికసించుదాకా
పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను
పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను

నేను సైతం.. నేను సైతం.. నేను సైతం

నేను సైతం.. నేను సైతం.. నేను సైతం

Cheppalani vundi Lyrics in Telugu – Rudraveena

Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading