ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Cheekati Velugula Kougitilo Lyrics In Telugu – Cheekati Velugulu
చీకటి వెలుగుల కౌగిటిలో… చిందే కుంకుమ వన్నెలూ
చీకటి వెలుగుల కౌగిటిలో… చిందే కుంకుమ వన్నెలూ
ఏకమైనా హృదయాలలో, ఓ ఓ
ఏకమైనా హృదయాలలో… పాకే బంగరు రంగులు
ఈ మెడ చుట్టూ గులాబీలూ… ఈ సిగపాయల మందారాలూ
ఈ మెడ చుట్టూ గులాబీలూ… ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలూ… చిక్కని ఈ అరుణ రాగాలూ
అందీ అందని సత్యాలా… సుందర మధుర స్వప్నాలా
తేట నీటి ఈ ఏటి ఒడ్డునా… నాటిన పువ్వుల తోటా
తేట నీటి ఈ ఏటి ఒడ్డునా… నాటిన పువ్వుల తోటా
నిండు కడవల నీరు పోసీ… గుండెల వలపులు కుమ్మరించీ
ప్రతి తీగకు చేయూతనిచ్చీ… ప్రతి మానూ పులకింప చేసీ
మనమే పెంచినదీ తోటా… మరి ఎన్నడు వాడనిదీ తోటా
మనమే పెంచినదీ తోటా… మరి ఎన్నడు వాడనిదీ తోటా
మరచి పోకుమా తోటమాలీ పొరపడి అయినా మతిమాలీ
మరచి పోకుమా తోటమాలీ పొరపడి అయినా మతిమాలీ
ఆరు ఋతువులు… ఆమని వేళలే మన తోటలో
అన్ని రాత్రులు పున్నమి రాత్రులే మన మనసులో
మల్లెలతో వసంతం… చేమంతులతో హేమంతం
వెన్నెల పారిజాతాలు… వానకారు సంపెంగలూ
అన్ని మనకు చుట్టాలే… వచ్చీ పోయే అతిధులే
ఈ మెడ చుట్టూ గులాబీలు… ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలూ చిక్కని ఈ అరుణ రాగాలూ
ఎక్కడివీ రాగాలూ చిక్కని ఈ అరుణ రాగాలూ
ష్.. గల గలమనకూడదూ ఆకులలో గాలీ
జల జలమనరాదూ అలలతో కొండవాగూ
నిదరోయే కొలను నీరూ
నిదరోయే కొలను నీరూ… కదపకూడదూ, ఊ ఊఊ
ఒదిగుండే పూలతీగా ఊపరాదూ
కొమ్మపైనిక జంట పూలూ గూటిలో ఇక రెండు గువ్వలూ
ఈ మెడ చుట్టూ గులాబీలూ ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలు చిక్కని ఈ అరుణ రాగాలూ
మరచిపోకుమా తోటమాలీ పొరపడి అయినా మతిమాలి