Menu Close

Changubhala Song Lyrics In Telugu – Oh Baby

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

విత్ ద రిథమ్… ఇన్ యువర్ ఫీట్
అండ్ ద మ్యూజిక్… ఇన్ ద సోల్
లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ టు ది స్కై… అండ్ సే గణేశా
హి ఈస్ యువర్ ఫ్రెండ్… వెన్ యు నీడ్
హి ఈస్ ద మేజిక్… ఇన్ యువర్ బీట్
లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ టు ద స్కై… అండ్ సే గణేశా

నేనే నేనా… వేరే ఎవరోనా, నేనే ఉన్నసందేహంలోనా
నా ఎండమావి దారుల్లొ… నవ్వులు పూసే
నా రెండు కళ్ళ వీధుల్లో… వెన్నెల కాసే
నా గుండె చూడు తొలిసారి… గంతులు వేసే
ఆ నిన్నల్లో మొన్నల్లో… కలలన్ని సడి చేసే

చాంగుభళా చాంగుభళా… చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయా… చెంగుమని భలేగా

చాంగుభళా చాంగుభళా… చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయా… చెంగుమని భలేగా
యవ్వనమే తుర్రుమని… పోయే తూనీగ
తిరిగి వచ్చే నిజంగా…
నేనే నేనా వేరే ఎవరోనా… నేనే ఉన్నసందేహంలోనా

ఇంత గొప్పగుంటుందా జీవితం… ఇంద్రధనుస్సు మెరిసినట్టుగా
తిరిగి వచ్చి చేరుకుంటే నా గతం… తెలుసుకుంటోంది మనసేమో మెలమెల్లగా
ఊహలన్నీ కిలకిలమంటూ… ఎగురుతున్నాయి సంకెళ్లు తెగినట్టుగా
గుండె పాట గొంతుని దాటి… పెదవుల తీగలపై మోగెనుగా
ఎన్నెన్నో స్వరాలుగా…

చాంగుభళా చాంగుభళా…చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయ… చెంగుమనిభలేగా
చాంగుభళా చాంగుభళా… చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయ… చెంగుమని భలేగా
యవ్వనమే తుర్రుమని తూనీగ… తిరిగి వచ్చే నిజంగా

లోకమంతా కొత్త కొత్తగుందిగా… పూలచెట్టు దులిపినట్టుగా
ఈ క్షణాన్ని పట్టుకుంట గట్టిగ… తల్లి వెళుతుంటే ఆపేసే పసిపాపలా
తీరిపోని సరదాలన్నీ తనివి తీరేలా… తీర్చేసుకోవాలిగా
ఆశలన్నీ దోసిట నింపి… సీతాకోకలుగా వదిలేస్తే
ఆనందం వేరు కదా…

చాంగుభళా చాంగుభళా… చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయి… చెంగుమనిభలేగా

చాంగుభళా చాంగుభళా… చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయి… చెంగుమని భలేగా
యవ్వనమే తుర్రుమని… పారిపోయే తూనీగ
తిరిగి వచ్చే నిజంగా…

విత్ ద రిథమ్… ఇన్ యువర్ ఫీట్
అండ్ ద మ్యూజిక్… ఇన్ ద సోల్
లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ టు ది స్కై… అండ్ సే గణేశా
హి ఈస్ యువర్ ఫ్రెండ్… వెన్ యు నీడ్
హి ఈస్ ద మేజిక్… ఇన్ యువర్ బీట్
లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ టు ద స్కై… అండ్ సే గణేశా

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading