ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Chanakya Niti in Telugu – చాణిక్య నీతి
సాధారణంగా పిల్లలు చిన్న చిన్న అబద్దాలు ఎక్కువగా చెప్తుంటారు. చిన్నప్పుడు అలా చెప్తే మనకు కూడా ముచ్చటేస్తుంటుంది. కానీ అదే అలవాటు పెద్దయ్యాక కూడా ఉంటే ప్యూచర్ లో సక్సెస్ కాలేడు. అందుకే పేరెంట్స్ పిల్లలకు అబద్దాలు చెప్పే అలవాటును మార్పించాలి.
దాని వల్ల జరిగే అనర్థాలను వివరించాలి. అయితే కొంత మంది పిల్లలు మొండిగా ప్రవర్తిస్తుంటారు. ఏది చేయకూడదని చెప్తే అదే ఎక్కువగా చేస్తుంటారు. ఎంత చెప్పినా అస్సలు వినరు. తల్లిదండ్రుల మాటను కూడా పట్టించుకోరు. ఇది ఇలాగే కొనసాగితే మర్ఖుల్లా తయారవుతారు. అందుకే పేరెంట్స్ ఈ ప్రవర్తనను చిన్నప్పుడే మార్చాలి.
కాగా పిల్లలు చదువుకునే టైంలో చెడు వ్యసనాలకు అలవాటు పడతారు. దీంతో చదువుపై శ్రద్ద పెట్టరు. ఇలాంటి టైంలోనే పేరెంట్స్ చొరవ తీసుకుని సరిదిద్దాలి. మంచి నడవడికను అలవర్చాలి.
మహానుభావుల, మేధావుల కథలు చెప్పి ఇన్సిపిరేషన్ ఇవ్వాలి. అప్పుడే లైఫ్ లో సక్సెస్ అవుతారని చాణక్య తన నీతిలో పేర్కొన్నాడు.చాణక్యుడు పిల్లలను ఐదేళ్ల పాటు ప్రేమగా పెంచాలని సూచించారు. ఎందుకంటే ఆ వయస్సులో పిల్లలకు మంచి చెడులను గుర్తించే సామర్థ్యం ఉండదు కాబట్టి. కాగా ఐదేళ్ల తర్వాత పిల్లలతో కాస్తా కఠనంగా ఉండాలని చెప్పారు. అలాగే టీనేజ్ లో పిల్లలతో స్నేహంగా ఉండాలని అన్నారు. ఆ వయస్సులో చెడుకు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటే అన్ని విషయాలు చెప్పుకుంటారు.
Chanakya Niti in Telugu – చాణిక్య నీతి