అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Chanakya Niti in Telugu – చాణిక్య నీతి
మనిషి జీవితంలో అనేక రకాల వ్యక్తులను కలుస్తూనే ఉంటారు. అయితే ఎవరితో ఎలా నడుచుకోవాలనేది తెలుసుకోవడం ముఖ్యం. అలా వ్యక్తి ప్రవర్తన తెలుసుకొని నడుచుకోవడం వలన జీవితంలో మనకి చాలావరకు వారి నుండి ప్రమాదాలు, కష్టాలు తగ్గుతాయి.
“చాణక్య నీతి సూత్రాలు – ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే గొప్ప పుస్తకం ఇది”
ఎవరెవరితో ఎలా ప్రవర్తించాలో చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు.
హింసాత్మక స్వభావం వున్నవారు: చాలా మంది వ్యక్తులు హింసాత్మక స్వభావం కల్గి ఉంటారు. వీరు ఎప్పుడూ ఏదో ఒక విధంగా మరొకరి జీవితానికి హాని చేయడానికి చూస్తుంటారు. అలాంటి వారిని ముందుగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత వరకూ ఇటువంటి స్వభావం కల్గిన వ్యక్తులకు దూరంగా ఉండటం మేలు అని చాణక్యుడు పేర్కొన్నాడు. హింసామార్గాన్ని ఎంచుకున్న వ్యక్తుల స్వభావం మనల్ని కూడా విధ్వంసం వైపు నడిపిస్తుంది.

చెడు ఆలోచనలు వున్నవారు: ఎప్పుడూ చెడు ఆలోచనలు ఉండకూడదు. ఎవరినీ దుష్ట ధోరణులతో చూడకూడదు. కానీ చెడు ఆలోచనలు కలిగిన వారితో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారితో మీరు కూడా అదే విధమైన నిర్ణయాలు తీసుకుని వారికి తగిన బుద్ధి చెప్పాలి అని చాణక్యుడు చెప్పాడు. ఇలా చేసిన తర్వాత ఏ విధమైన పశ్చాత్తాపం చెందకండి. ఎందుకంటే మీరు దుర్మార్గులతో మంచిగా ఉంటే తర్వాత వాళ్లు మీకు చెడు చేస్తారు. చెడ్డవారితో చెడ్డగానే వుండాలి. అందుకే ఒక్కసారి గుణపాఠం చెబితే మళ్ళీ మీకు కీడు చేసేందుకే వాళ్ళు భయపడతారు.
అలాగే శ్రేయోభిలాషులందరినీ సమానంగా చూడాల్సిన అవసరం లేదట. ఉపకారం చేయాలనే ధోరణిని అవలంబించే వారితో మీరు కూడా పరోపకార వైఖరిని అలవర్చుకోవాలి. అవతలివారు మీ కోసం కొంచెం చేస్తే.. మీరు వారికి రెట్టింపు చేస్తారు. అలాంటి ప్రవర్తనను అలవర్చుకోవడం ద్వారా రెట్టింపు పురోగతిని సాధించవచ్చు.
Chanakya Niti in Telugu – చాణిక్య నీతి