ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Chanakya Neethi in Telugu – చాణక్యుడు ఒక శ్లోకం ద్వారా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మీ ప్రియమైన తల్లి, కొడుకు, భార్య, తండ్రి కూడా మీ శత్రువులని చెప్పాడు.
ఋణ కర్తా పితా శత్రు:
మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రు:
పుత్ర: శత్రురపండిత
ముందుగా తండ్రిని ఉద్దేశించి ఆచార్య మాట్లాడుతూ అప్పులు చేసి తిరిగి చెల్లించని తండ్రి, బలవంతంగా కొడుకుపై భారం మోపుతూ.. అలాంటి కొడుకు జీవితం ఎప్పుడూ బాధాకరమే. అలాంటి తండ్రి ఆ కొడుకుకు శత్రువు కంటే తక్కువ కాదని అర్ధం.
తల్లి తన పిల్లల మధ్య ఎప్పుడూ వివక్ష చూపదని అంటారు. కానీ పిల్లల మధ్య వివక్ష చూపే తల్లి కూడా తన పిల్లలకు శత్రువు లాంటిది. అంతే కాకుండా భర్తతో కాకుండా వేరొకరితో సంబంధం పెట్టుకున్న తల్లి కూడా కొడుకుకు శత్రువు లాంటిది. అలాంటి తల్లిని నమ్మడం మూర్ఖత్వం.
మీ భార్య చాలా అందంగా ఉండి.. భార్య ముందు భర్త తక్కువ స్థాయిలో ఉన్నట్లు అయితే భార్య అందం చాలాసార్లు సమస్యగా మారుతుంది. భర్త ఆమెను రక్షించలేడు. ఈ విధంగా ఆ అందమైన భార్య కూడా ఆ భర్తకు శత్రువు అవుతుంది.
మూర్ఖుడు, జ్ఞానం లేని పిల్లవాడు ఎప్పటికీ అభివృద్ధి చెందలేడు. అలాంటి బిడ్డ తల్లిదండ్రులకు భారం. అలంటి పిల్లలను తల్లిదండ్రులు జీవితమంతా బలవంతంగా మోస్తారు. అలాంటి బిడ్డ తల్లిదండ్రుల జీవితానికి శాపం. ఆ పిల్లవాడు తల్లిదండ్రులకు శత్రువు కంటే తక్కువ కాదు.