చాణక్య నీతి ప్రకారం.. అగ్ని నైజం కాల్చేది.. దానిని తలమీద పెట్టుకుని మోసినా దాని నైజం మారనట్లు .. అదే విధంగా, దుర్మార్గుడిని మీరు ఎంత గౌరవించినా.. అతని గుణం ఎప్పుడూ మారదు.
“చాణక్య నీతి సూత్రాలు – ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే గొప్ప పుస్తకం ఇది”
జీవితంలో విజయం సాధించడానికి ప్రాథమిక మంత్రం క్రమశిక్షణ. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి సమయం విలువను గౌరవిస్తాడు, అలాగే ఒక పనిని సమయానికి పూర్తి చేయగల సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాడు.
నిన్ను గౌరవించని చోట,
జీవనోపాధి పొందలేని చోట,
స్నేహితులు లేని చోట,
జ్ఞానం గురించి మాట్లాడని చోట
ఒక్క క్షణం కూడా ఉండవద్దు.
అదృష్టం మీద ఆధారపడి పనిచేసే వ్యక్తులు సోమరులు, అజాగ్రత్త పరులుగా మారతారు.
భూమి సత్యంపై ఆధారపడి ఉంది. సూర్యుడు ప్రకాశించడం, గాలి వీచడం కూడా వాస్తవం. సత్యం అందరికీ ఒకేలా ఉంటుంది. ఎప్పటికీ మారదు. ఈ సత్యం ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న వ్యక్తి ఉత్తముడు.