ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Business Ideas in Telugu: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు సకాలం కంటే ముందే కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయంటూ భారత వాతావరణ కేంద్రం సైతం అంచనా వేసింది. ఎండలు ఇక తగ్గుముఖం పట్టినట్టే. వర్షాకాలం ఆరంభమౌతుందనగానే చాలామంది మొక్కల పెంపకంపై ఆసక్తి చూపుతుంటారు. వర్షలు పడటం మొదలు కాగానే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నర్సరీలకు డిమాండ్ పెరుగుతుంది. మొక్కలను కొనుగోలు చేసే వారి సందడి కనిపిస్తుంటుంది.
ఇవే నర్సరీలు ఇప్పుడు గ్రామస్థాయికీ విస్తరించాయి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నర్సరీలను ఏర్పాటు చేయడానికి కేంద్రప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఫలితంగా ఈ మధ్యకాలంలో నర్సరీలను ఏర్పాటు చేయడానికి చాలామంది ప్రాధాన్యత ఇస్తున్నారు. మొక్కలను విక్రయించడం ద్వారా ప్రతినెలా 50,000 నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని ఆర్జించుకోవడానికి అవకాశం ఉండటమే దీనికి కారణం.
నర్సరీలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆరు లక్షల రూపాయల నిధులను ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేస్తోంది. ఈ పథకం కింద నర్సరీలను ఏర్పాటు చేయదలిచిన వారి కోసం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఒక్కో నర్సరీలో 50 వేల మొక్కలను పెంచాల్సి ఉంటుంది. ఒక్కో మొక్కకు నెలకు రూపాయి చొప్పున ఈ పథకం కింద నిధులు మంజూరవుతాయి. అంటే నెలకు 50,000 రూపాయల ఆదాయం సమకూరినట్టే.
జాతీయ ఉపాధి హామీ పథకం కింద నర్సరీలను ఏర్పాటు చేసే విషయంలో సన్న, చిన్నకారు రైతులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. నర్సరీల వ్యాపారాన్ని మొదలు పెట్టదలిచిన వారికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి అవసరమైన సహాయ, సహకారాలు అందుతాయి. నీటి సౌకర్యం కలిగి ఉన్న స్థలాన్ని మనం అధికారులకు చూపించాల్సి ఉంటుంది. నీటి సౌకర్యం ఉన్నా గానీ నర్సరీలను ఏర్పాటు చేసుకోవచ్చు.
పండ్లు, పూలు, కూరగాయల మొక్కలకు మంచి డిమాండ్ ఉంది. గులాబీ, చామంతి వంటివి ఏ సీజన్‌లో అయినా పెరుగుతాయి. టొమాటో, పచ్చిమిరప, బెండ వంటి మొక్కలు ఎక్కడైనా పెంచుకోవచ్చు. తులసీ మొక్కలకు ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఔషధ మొక్కలకు ఉన్న ఆదరణ కూడా అలాంటిదే. సర్పగంధ, అశ్వగంధ, బ్రహ్మి, అలోవిరా, ఉసిరి వంటి మెడిసినల్ ప్లాంట్స్‌ను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు కొనుగోలుదారులు.
ఇవే నర్సరీల్లో విత్తనాలను కూడా విక్రయించుకోవచ్చు. టొమాటో, బెండ సీడ్స్‌కు మంచి ఆదరణ ఉంది. ఒక్కో మొక్క- వాటి జాతులు, విభిన్నత ఆధారంగా భారీ ధర పలుకుతుంటుంది. వర్షాకాలం ఆరంభానికి ముందే- నర్సరీల వ్యాపారాన్ని ఆరంభించగలిగితే- ఈ సీజన్ ముగిసే లోగా మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఆ తరువతా మొక్కలకు మంచి గిరాకీ ఉంటుంది. పెరటితో పాటు డాబాలపైనా కూరగాయలు, పండ్లను సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో- నర్సరీల ద్వారా ప్రతినెలా మంచి ఆదాయాన్ని సాధించవచ్చు.
ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.