ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Business Ideas in Telugu – Bamboo Cultivation: మీకు ఎక్కడా చిన్న స్థలం ఉందా.. అయితే అలా ఖాళీగా ఉంచకుండా.. అక్కడ ఈ పని చేయండి.. కేవలం మీరు వేలల్లో పెట్టుబడి పెడితే.. లక్షల్లో ఆదాయం ఉంటుంది. అది కూడా చాలా సులువైన మార్గం ద్వారానే? ఎలా అనుకుంటున్నారా..?
అయితే శుభావార్త.. కేవలం వేలల్లో పెట్టుబడి పెడితే.. లక్షల్లో సంపాదించవచ్చు.. ఇది ఎలా సాధ్యం అని అనుమాన పడుతున్నారు. అయితే వెదురు సాగు గురించి తెలుసుకోవాల్సిందే.. అయితే వెదురు చాలా అందంగా, నిటారుగా పెరిగే సుందరమైన చెట్టు.. ఇప్పుడీ చెట్లని పెంపకానికి కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చేసింది. ఇది నిజంగా శుభవార్త.
సాధరణంగా గిరిజన ప్రాంతాల్లోనే కనిపించే ఈ వెదురు చెట్ల పెంపకాన్ని ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో చేపట్టొచ్చని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ప్రకటించింది. దీనిలో భాగంగా బేంబూ (వెదురు) మిషన్ ప్రాజెక్టు ను అమలు చేయాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కింద అటవీ ప్రాంతాలకు వెలుపల బంజరు భూములు, పంట పొలాలు, గ్రామాల్లో ప్రభుత్వ ఖాళీ స్థలాలు, కాలువలు, చెరువు గట్ల వెంబడి వెదురు మొక్కలను పెంచుతారు.
ఇకపై జిరాయితీ భూముల్లో రైతులు సొంతంగా వెదురు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇతరచోట్ల డ్వాక్రా సంఘాలకు బాధ్యతలు అప్పగిస్తారు. వెదురు పొదలు ఏపుగా పెరిగిన తరువాత విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తారు. ఇందుకోసం నిరుద్యోగ యువతతో కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయిస్తారు..
వెదురు వనాల పెంపకం, ఉత్పత్తుల అమ్మకాలు ఇటీవల వరకు అటవీ శాఖ పరిధిలో వుండేవి. దీంతో అటవీయేతర ప్రాంతాల్లో ఎవరైనా వెదురు సాగు చేపట్టి, ఉత్పత్తులను అమ్ముకోవాలంటే అటవీ శాఖ అనుమతులు తప్పని సరి అయ్యేవి..
అయితే ఇప్పుడు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెదురు ఉత్పత్తులకు మార్కెట్‌లో నానాటికీ ఆదరణ పెరుగుతోంది. అడవులకు వెలుపల వున్న ప్రాంతాల్లో వెదురు పెంపకం చేపట్టాలన్న ఆసక్తి వున్న రైతులకు అటవీ శాఖ నిబంధనలు అడ్డంకిగా మారాయి.
అందుకే ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి రావడంతో అటవీ, పర్యావరణ శాఖ పరిధిలో ఉన్న రాష్ట్ర వెదురు మిషన్‌ను వ్యవసాయ, సహకార శాఖ (ఉద్యానశాఖ) లోకి మారుస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
రికార్డు చేయబడిన అటవీ ప్రాంతాల వెలుపల వ్యవసాయ భూముల్లో వెదురు సాగును ప్రోత్సహించడంతోపాటు వెదురుకు అదనపు విలువ జోడించేందుకు ఈ మార్పు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వెదురు ప్రాజెక్టు అమలుకు సంబంధించి ఉద్యాన శాఖ అధికారులు సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. దీనిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం, ప్రాజెక్టు అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ నుంచి అనకాపల్లి జిల్లా అధికార యంత్రాంగానికి ఉత్తర్వులు అందాయి.
‘బేంబూ మిషన్ ప్రాజెక్టు’కు అయ్యే వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరిస్తాయి. జిల్లాలో వెదురు నర్సరీలు, మొక్కల పంపిణీ బాధ్యతను ప్రభుత్వ ఉద్యాన శాఖ చేపడుతుంది. ఒక హెక్టారుకు దూరాన్ని బట్టి 400 నుంచి 500 వరకు మొక్కలను మూడు విడతలుగా నాటుకోవచ్చు.
ఇక జిరాయితీ భూముల్లో సంబంధిత రైతులు వెదురు సాగు చేసుకుంటారు. వీరికి 50 శాతం రాయితీపై ఉద్యాన శాఖ నర్సరీల నుంచి మొక్కలను అందజేస్తారు. గ్రామాల్లో ఖాళీగా వున్న ప్రభుత్వ, పంచాయతీ స్థలాలు, కాలువలు, చెరువు గంట్ల వెంబడి వెదురు మొక్కలను నాటి పెంచుతారు. ఈ బాధ్యతను స్థానిక డ్వాక్రా సంఘాలకు లేదా ఉపాధి కూలీలకు అప్పగిస్తారని అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది.
వీరికి మొక్కలను ఉచితంగా అందజేస్తారు. ఐదు సంవత్సరాల వరకు వీటిని సంరక్షించే బాధ్యత వీరిదే అని ప్రభుత్వం కండిషన్ పెట్టనుంది. ఇందుకు ప్రతిఫలంగా వెదురు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంలో కొంతమొత్తం ఇవ్వడం, లేదా ఉపాధి పనుల తరహాలో కూలి డబ్బులు ఇవ్వడం… వీటిలో ఏదో ఒకదానిని అమలు చేసే అవకాశం ఉంది.
మొక్కలు నాటిన ఐదు సంవత్సరాల తరువాత వెదురును నరుకుతారు. ‘బేంబూ మిషన్ ప్రాజెక్టు’లో భాగంగా గ్రామీణ యువతతో వెదురు ఆధారిత ఉత్పత్తుల తయారీకి కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయిస్తామని, ఈ ఉత్పత్తుల అమ్మకం ద్వారా స్వయం ఉపాధి లభిస్తుందని జిల్లా ఉద్యాన శాఖ చెబతోంది. కేవలం వేలల్లో పెట్టుబడి పెడితే.. లక్షల్లో ఆదాయం వస్తుందనే భరోసా కల్పిస్తోంది.
ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.