Menu Close

BulReddy Song Lyrics In Telugu – sita

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ఒంటి తీరు పాలకోవా… నడక చూస్తే హంస నావా
సోకు బరువు మోయగలవా… సాయమోస్తాం సై అనవా !!

బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి… రాజ్దూత్ మీదొచ్చే రామ్ రెడ్డి
బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి… రాజ్దూత్ మీదొచ్చే రామ్ రెడ్డి
యమహా ఏస్కోచే యాది రెడ్డి… బజాజ్ మీదొచ్చే బాల్ రెడ్డి
స్టాండైనా ఎయ్యరాళ్ళు… వచ్చాక ఆగరాళ్ళు
ఎట్టా సచ్చేదిరో పెద్ది రెడ్డి…

రెడ్డిగారి రెడ్డిగారి…
రెడ్డిగారి కుర్రోళ్ళిట్టా… రెచ్చిపోతే ఎట్టాగంట
రెడ్డిగారి కుర్రోళ్ళిట్టా… రెచ్చిపోతే ఎట్టాగంట

బుల్లెట్టు డుర్ర్ అహ… బుల్లెట్టు డుర్ర్
అరె బుల్ బుల్ బుల్… బుల్ బుల్ బుల్లెట్టు
బుల్లెట్టు మీదొచ్చే… బుల్ రెడ్డి
రాజ్దూత్ మీదొచ్చే… రామ్ రెడ్డి

హే పిల్లా..! నిన్ను చూస్తే రెచ్చిపోకుండా ఎట్టుంటాం కాని
ఇంతకీ మాకు… టులెట్ బోర్డు ఉందా లేదా ??

ఎహే… ముంబైలో మా బావ టైలర్…అబ్బ
అంటారు వాడినంత టైగర్… ఛా
పండక్కు వచ్చి నన్ను పెళ్ళాడతాను… అంటూ ప్రామిస్సు కూడా చేసినాడు

మీ బావ కొట్టాడు పంపు… ఆడేమో అట్నుంచి జంపు
మొన్నాడు పట్నంలో… మసీదు గల్లీలో
పెళ్ళాంతో పూలు కొంటున్నాడు…

మాయగాడు సచ్చినోడు… సొమ్ములన్నీ దోచేశాడు
నన్ను ఇట్టా ముంచేశాడు…
నా సొమ్ములన్నీ దోచేశాడు… నన్ను ఇట్టా ముంచేశాడు
ఓ ఓ… బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి

ఒరే ఒరే ఒరే నీ టైగర్ బావ… జంప్ అయిపోయినాడ
అయితే నువ్వు ఖాళీయే కదా..!!
లేదు… అరె పక్కింటి కుర్రాడు శీను
మా వీధిలో వాడు డాను…

నీలాంటి అందగత్తె జిల్లాలో లేదు… అంటూ రక్తంతో రాసి ఇచ్చాడు
శీనుగాడు ఎసాడు రీలు… ఆహా
వాన్ని నిన్న పంపారు జైలు… అవునా
వాడింక రాడుగాని… ఒక్కడ్ని ఎంచుకుంటే
తక్కినోళ్లం తప్పుకుంటాము…

రెడ్డిగారి రెడ్డిగారి…
రెడ్డిగారి కుర్రాళ్ళను… నే తప్పుగానే అనుకున్నాను
ముందు చూస్తే భయమేసింది… మనసు చూస్తే మతిపోయింది
ముందు చూస్తే భయమేసింది… మనసు చూస్తే మతిపోయింది
బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి…

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading