అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
హాస్య బ్రహ్మగా బ్రహ్మానందం గారి నటన గురించి అందరికీ తెలుసు కానీ ఆయన చిత్రలేఖనం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. లాక్‌డౌన్‌లో ఆయన కాగితం, పెన్సిలు పట్టుకుని గీసిన చిత్రాలు ఎంతగానో వైరల్ అయ్యాయి. దీంతో ఈ సాహితీ ప్రియుడి కళా నైపుణ్యానికి అభిమానులు మంత్ర ముగ్దులవుతున్నారు.
మొన్నామధ్య అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సమయంలో బ్రహ్మానందం రాముని వీర భక్తుడు ‘ఆంజనేయుని ఆనంద భాష్పాలు‘ పేరుతో చిత్రం గీశారు. ఆ డ్రాయింగ్ చాలామందిని ఆకట్టుకుంది.
ఇప్పుడు తాజాగా శ్రీ వెంకటేశ్వర స్వామిని తన కుంచెతో కాగితంపై సాక్షాత్కరించారు. దీన్ని గీయడానికి ఆయనకు 45 రోజుల సమయం పట్టింది. వెంకన్న కరుణా రసం కురిపిస్తున్నట్లుగా ఉన్న ఈ చిత్రపటాన్ని బ్రహ్మానందం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు బహుమతిగా ఇచ్చారు.
స్వహస్తాలతో గీసిన ఈ డ్రాయింగ్స్ చూసి బన్నీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు వెలకట్టలేని బహుమతి అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బ్రహ్మానందం డ్రాయింగ్ ఫొటోలు వైరల్‌గా మారాయి.







