Menu Close

Bhale Bhale Banjara Song Lyrics in Telugu – Acharya

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Bhale Bhale Banjara Song Lyrics in Telugu – Acharya

హే, సింబా రింబా సింబా రింబా
సిరుత పులుల సిందాట
హే, సింబా రింబా సింబా రింబా
సరదా పులుల సయ్యాట

సీమలు దూరని సిట్టడవీకి సిరునవ్వొచ్చింది
నిప్పు కాక రేగింది… రప్పాప
డప్పు మోత మోగింది… రప్పాప

కాకులు దూరని కారడవీలో
పండగ పుట్టింది
గాలి గంతులాడింది… రప్పాప
నేల వంత పాడింది… రప్పాప

సీకటంతా సిల్లు పడి
వెన్నెలయ్యిందియ్యాల
అందినంతా దండుకుందాం పదా
తలో చెయ్యరా

భలే భలే బంజారా, షల్లలల్లా
మజా మందేరా, షల్లలల్లా
రేయి కచేరీలో… రెచ్చీపోదాం రా
హే రబ్బా రబ్బా..!!
భల్లే భల్లే బంజారా
మజ్జా మందేరా
రేయి కచేరీలో… రెచ్చీపోదాం రా
హే రబ్బా రబ్బా..!!

సీమలు దూరని సిట్టడవీకి సిరునవ్వొచ్చింది
నిప్పు కాక రేగింది… డప్పు మోత మోగింది
షల్లలల్లా, హేయ్ హేయ్… షల్లలల్లా

హే, కొక్కరికో కోడి కూత… ఈ పక్క రావొద్ధే
ఐతలక్క ఆడే పాడే… మా లెక్కనాపొద్దే
తద్దినదిన సుక్కలదాకా… లెగిసి ఆడాలా
అద్దిరబన్నా ఆకాశ కప్పు అదిరి పడాలా

అరసెయ్యి గీతకు సిక్కింది
భూగోళమియ్యాలా
పిల్లోల్లమల్లే దాన్నట్టా
బొంగరమెయ్యాలా

భలే భలే బంజారా, షల్లలల్లా
మజా మందేరా, షల్లలల్లా
రేయి కచేరీలో… రెచ్చీపోదాం రా
హే రబ్బా రబ్బా..!!

భల్లే భల్లే బంజారా
మజ్జా మందేరా
రేయి కచేరీలో… రెచ్చీపోదాం రా
హే రబ్బా రబ్బా రబ్బా..!!

నేస్తమేగా చుట్టూ ఉన్న… చెట్టైనా పిట్టైనా
దోస్తులేగా రాస్తాలోని… గుంటైనా మిట్టయినా
అమ్మకు మల్లే నిన్ను నన్ను సాకింది ఈ వనము
ఆ తల్లి బిడ్డల సల్లంగ జూసే ఆయుధమే మనము
గుండెకు దగ్గరి ప్రాణాలు ఈ గూడెం జనాలు
ఈడ కష్టం సుఖం రెండిటికి మనమే అయినోళ్లు

భలే భలే బంజారా, షల్లలల్లా
మజా మందేరా, షల్లలల్లా
రేయి కచేరీలో… రెచ్చీపోదాం రా
హే రబ్బా రబ్బా..!!

భల్లే భల్లే బంజారా
మజ్జా మందేరా
రేయి కచేరీలో… రెచ్చీపోదాం రా
హే రబ్బా రబ్బా రబ్బా..!!

Bhale Bhale Banjara Song Lyrics in Telugu - Acharya

Song Credits:
Song : Bhale Bhale Banjara
Singers: Shankar Mahadevan, Rahul Sipligunj
Lyrics: Ramajogayya Sastry
Music: Mani Sharma
Label Credits – Aditya Music

Bhale Bhale Banjara Song Lyrics in Telugu – Acharya

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading