Menu Close

మహాకవి కాళిదాసుకి చెమటలు పట్టించిన అవ్వ-ఇలాంటి కథలే మనం చదవాల్సినవి-Best Telugu Stories

మహాకవి కాళిదాసు ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. దాహం వేయడంతో కాళిదాసు ఓ గుడిసె దగ్గరకు వెళ్ళి “దాహంగా ఉంది, నీళ్లు ఇవ్వండి” అని అడుగుతాడు….

గుడిస లోపల నుండి ఓ ముసలావిడ బయటకు వచ్చి ‘మీరెవరు? ఎక్కడనుండి వస్తున్నారు?’ అంటుంది…. కాళిదాసు “నేను ఎవరో తెలియకపోవడం ఏంటి? నేను ఓ పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతారు” అని అంటాడు…. ఆ మాటలు విన్న ముసలావిడ నవ్వి..’మీరు అసత్యమాడుతున్నారు. మీరంత గొప్పవారైతే ప్రపంచంలో ఇద్దరు బలవంతులెవరో చెప్పండి’ అంటుంది….

కాళిదాసు కాసేపు ఆలోచించి “నాకు తెలియదు. గొంతు ఎండి పోతుంది, ముందు నీళ్లు ఇవ్వండి” అని బతిమాలుకుంటాడు… “ఆ ఇద్దరు బలవంతులు ఆకలి, దాహం. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?” అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ…. ఈసారి ‘నేను బాటసారి’ని అంటాడు కాళిదాసు….

అయితే ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే ఇద్దరు బాటసారులు ఎవరూ అంటూ ప్రశ్నిస్తుంది ముసలావిడ…. తెల్ల ముఖం పెట్టి మాతా! “నీళ్ళు ఇవ్వండి. లేకుంటే దాహంతో చనిపోయేలా ఉన్నాను” అంటూ ప్రాదేయపడతాడు కాళీదాసు….

వాళ్ళు సూర్యచంద్రులు అని తెలిపి “మరి మీరెవరో సెలవివ్వండి.నీళ్లిస్తాను” అంటుంది ముసలావిడ…. కాళిదాసు దీనంగా “నేను అతిథిని” అని బదులిస్తాడు….”మీరు మళ్ళీ అసత్యం చెబుతున్నారు. ఈ సృష్టిలో అతిథులు ఇద్దరే. ఒకటి ధనం, రెండోది యవ్వనం. అవి ఎప్పుడు వస్తాయో పోతాయో ఎవరికీ తెలియదు” అంటుంది ముసలావిడ….

కాళిదాసు “నా సహన పరీక్ష తరువాత చేద్దురు. ముందు నీళ్లు ఇవ్వండి” అని వేడుకుంటాడు…. “ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు. వారెవరో శెలవివ్వ గలరా” అంటూ… బిక్కమొహం వేసిన కాళీదాసుతో “ఒకటి భూమి,రెండోది వృక్షం” అని భోద పరచి “ఇప్పుడు నిజం చెప్పండి మీరెవరు?” అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ….

Winter Needs - Hoodies - Buy Now

ఓపిక నశించిన కాళిదాసు “నేను మూర్ఖుడను. ఈ మూర్ఖుడికి ఇప్పుడైనా నీళ్లివ్వండి” అని సాగిల పడతాడు….ఆ అవ్వ నవ్వుతూ “ఇదీ అసత్యమే. ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు” అని అంటుంది….

ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు…. ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది. ‘నాయనా! విద్యతో వినయం వృద్ధి చెందాలి, అహంకారం కాదు. కీర్తి,ప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని సరి చేయటానికే ఈ పరీక్ష’ అని మంచినీరు అందించి దాహం తీరుస్తుంది.

విద్య, అధికారం, ధన బలము తో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి.

Like and Share
+1
1
+1
1
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading