Menu Close

బెస్ట్ తెలుగు కోట్స్ – Best Telugu Quotes Text Part 5

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

  1. నిన్నటి పొరపాట్లతోను, రేపటి గురించి భయంతోనో ఈ రోజును వృథా చేయకు.
  2. అయ్యింది, అవుతున్నది, అవ్వబోయేది కూడ నీ మంచికే.
  3. నిరాడంబరంగా జీవించడం, ఉన్నతంగా ఆలోచించడం ప్రతి ఒక్కరూ
    చేయవలసిన పనులు.
  4. అభివృద్ధి అనేది భవిష్యత్తుకు కొత్త అవకాశాలు కల్పించడమే కాదు, కొత్త
    నిబంధనలు కూడ పెడుతుంది.
  5. నింద నిజమైతే తప్పక దిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో.
  6. వారసత్వంగా సంక్రమించిన దానికంటే, స్వయంకృషి ద్వారా సాధించుకొన్నదే మిన్న.
  7. తల్లిదండ్రులు పిల్లలకు మంచి సలహాలు, మంచి మార్గాన్ని మాత్రమే సూచించగలరు. కానీ వ్యక్తిత్వాన్ని మలచుకోవడం మాత్రం వారి చేతుల్లోనే ఉంటుంది.
  8. గెలవాలన్న తపన తగ్గు ముఖం పడితే ఓటమికి దగ్గరైనట్లే.
  9. దేని ద్వారా వ్యక్తిత్వం ఏర్పడుతుందో, ఆత్మవిశ్వాసం పెంపొందుతుందో, బుద్ధి
    వికసిస్తుందో అదే మంచి విద్య.
  10. సుఖశాంతులనేవి ఒకరికి నీవు ఇచ్చే వాటిపై ఆధారపడి ఉంటాయి. అంతేకాని
    వారి నుండి నీవు పుచ్చుకునే వాటిపై కాదు.
  11. అందం తొందరగా కంటికి పాతబడి పోతుంది. సళిలిశీల్యానికి మాత్రమే ఎప్పుడూ నశించని ఆకర్షణ ఉంటుంది.
  12. ప్రతి వ్యక్తీ గొప్పవాడయ్యేందుకు ప్రయత్నించవచ్చు. కానీ అది ఇతరుల పతనాన్ని కోరుకోవడంవల్ల కాకూడదు.
  13. బాధ్యతారహితమైన మాటలు …. ఇతరులకు మనపై ఉన్న ప్రేమను తగ్గిస్తాయి.
  14. సోమరితనం అన్నిటికి కష్టాలు కలిగిస్తే, శ్రమ అన్నిటినీ తేలిక చేస్తుంది.
  15. భగవంతుణ్ణి మీరు ఎంత కోరినా మీకు ఇవ్వలేదంటే అది మీకు దక్కక పోవటమే మంచిదని అర్థం.
  16. ఒక వ్యక్తి జీవితంలోని విజయము, అతి సంకల్ప శక్తి, ఒకే నిష్పత్తిలో ఉంటాయి.
  17. నిత్యమూ శ్రమించేవాడికి కొద్దిపాటి విశ్రాంతి అయినా సరిపోతుంది.
  18. సర్దుబాటు మనస్తత్వం ఉన్నవాడే బతకటంలో బహునేర్పరి.
  19. మనకు తెలిసిందేదో, తెలియనిదేదో తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం.
  20. సంతోషంగా ఉండే వారితో స్నేహం చేయాలి.
  21. ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని. తనని తాను తెలుసుకున్నవాడే వివేకి.
  22. స్వేచ్ఛగా జీవించే వ్యక్తి తన చుట్టూ గొప్ప వ్యక్తులను సృష్టించుకుంటాడు.
  23. పరిస్థితులను శాంతియుతంగా ఎదుర్కోవడం వల్ల మనోబలం పెరుగుతుంది.
  24. స్వలాభం కోసం చేసే పనులైనా, ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండాలి.
  25. ప్రకృతి, కాలం, ధైర్యం …. ఈ మూడు ఉత్తమమైన గొప్ప వైద్యులు.
  26. మనిషి జీవితానికి నిజాయితీ పునాది. మానవత్వంలో ఒక భాగం నిజాయితీ.
  27. నిజాయితీగా కష్టపడి సంపాదించిన ధనం సంతోషం కలిగిస్తుంది.
  28. దూరంగా ఉన్న ‘గెలుపు’ ను చూస్తూ ప్రయాణం చేస్తాడు సామాన్యుడు.
    ‘గెలుపు’తోనే ప్రయాణం చేస్తాడు మేథావి !

మరిన్ని తెలుగు కోట్స్- Telugu Quotes

అద్బుతమైన తెలుగు కవితలు – Telugu Poetry

కడుబుబ్బా నవ్వించే జోక్స్- Telugu Jokes

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading