మనిషి విజయం సాధించడానికి క్రమశిక్షణ, ఆత్మనిగ్రహం ఉండాలి.
మనపై మనకు శ్రద్ధ, భక్తి, విశ్వాసాలు లేకపోతే, మనం ఇతరులకేమి మంచి చెప్పగలం – ఏమి మంచి చేయగలం.
వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలలో పంచుకునే జ్ఞానాన్ని, వ్యూహాలను లోతుగా అర్థం చేసుకుని, కనీసం 21 రోజులపాటు పూర్తి విశ్వాసంతో దాన్ని ఆచరిస్తే మీ జీవితాలలో విజయం తేలికగా సాధించవచ్చు.
ధనం సంపాదించడంతో నీకృషిని ఆపవద్దు. దయాగుణం, ధర్మబుద్ధికూడ అలవర్చుకో.
మన జీవితాల్నేకాదు, మన చుట్టూ ఉన్నవారి జీవితాలలో కూడ కొంత వెలుగును నింపుదాం.
మనం మంచివారిగా ఉండగలగటం అంటే – చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండడానికి ప్రయత్నించడమే.
మీ హృదయాన్ని పూర్తిగా తెరచి ఉంచినప్పుడే, ఇతరుల హృదయాలను తాకగలుగుతారు.
తెలివైన వారు ప్రారంభంలోనే చేసే మొదటి పనిని, తెలివి తక్కువవారు చివరలో కూడ చేయడనికి సందేహిస్తూ ఉంటారు.
మనం ఏదైనా మంచి పనిని చేయగలం అనే మంచి ఆలోచన మనకు వస్తే చాలు – అదే మనకు చేయగల శక్తినిస్తుంది.
మంచి స్నేహితుల్ని పొందాలంటే, ముందుగా మనం మంచి స్నేహ భావాలు కలిగి ఉండలి.
నీలోపల ఉన్న శక్తిని వినియోగించుకోవడం ప్రారంభిస్తే చాలు – నీ జీవితం ఇప్పిటికన్నా తప్పకుండ మెరుగ్గా తయారవుతుంది.
ఆపదలో అవసరాన్ని, బాధల్లో మనసును తెలుసుకుని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు.
నీ జీవితంలో జరిగిన విషయాలకు ఆందోళన పడ వద్దు. అందులో నుండి ఆనందంగా జీవించడం నేర్చుకో.