మరిన్ని తెలుగు కోట్స్- Telugu Quotes
అద్బుతమైన తెలుగు కవితలు – Telugu Poetry
కడుబుబ్బా నవ్వించే జోక్స్- Telugu Jokes
- నీలోని ప్రతిభను, తెలివి తేటలను, నైపుణ్యాలను, శక్తిసామర్థాలను మరింత
గొప్పగా, మరింత మెరుగ్గా, మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడనికి
నీకు లభించే సువర్ణ అవకాశమే ”ఓటమి”. - ఆరాటం ముందు పోరాటం ఎంత? సంకల్పం ముందు వైకల్యం ఎంత? దృఢ
చిత్తం ముందు దురదృష్టం ఎంత? ఎదురీత ముందు విధిరాత ఎంత? - గెలుపుకోసం అడ్డదారులు వద్దు. మీ శక్తిని పూర్తిగా వినియోగిస్తే గెలుపు తథ్యం.
- మీకు సంతోషాన్ని కలిగించేది మీరు ఉన్న స్థానం కాదు, మీ స్వభావం.
- నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. శక్తి నిచ్చేది ధనం కాదు. శక్తి నిచ్చేది మీ
మంచితనం, మీ పవిత్రత, మీ దృఢచిత్తం, మీ కార్యాచరణ. - ప్రతిపనిని సులభంగా ఎలా చేయాలో తెలుసుకోవాలి. కానీ ఏ పనినీ చులకన
చేసి చూడొద్దు. - ఎదురుచూస్తూ కూర్చునే వారికన్నా, ముందడుగు వేసేవారికే సర్వం సిద్ధిస్తుంది.
- తెలివైనవాడు ఒక శాతం స్పూర్తితో తొంభైతొమ్మిది శాతం కష్టపడి స్పూర్తిని
సాకారం చేసుకుంటాడు. - విద్యతో వినయం, వినయంతో వ్యక్తిత్వం, వ్యక్తిత్వంతో ధనం, ధనంతో ధర్మం,
ధర్మంతో సుఖం వరుసగా లభిస్తాయి. - నీ శక్తి సామర్థ్యాలను పెంపు చేసుకోవడనికి నీ సమయాన్ని వినియోగించు.
అప్పుడు ఇతరులను విమర్శించే కాలం వుండదు. - సత్యాన్ని మించిన ధర్మంలేదు. పరోపకారాన్ని మించిన దైవప్రార్థన లేదు.
- వినయంతో ప్రారంభించి, సహనంతో కొనసాగిస్తేనే మహాకార్యాలు
సాధ్యమవుతాయి. - బుద్ధిమంతులు అటు పుస్తకాన్ని, ఇటు జీవితాన్ని కలిపి చదువుతారు.
- అభిరుచిని బట్టే ప్రవర్తన ఉంటుంది. ఆ ప్రవర్తనే మన విధిని నిర్దేశిస్తుంది.
- అవసరాలను, పరిస్థితులను గమనిస్తూ జీవించేవారు క్లిష్టసమయాల్లో వారిని
వారు కాపాడుకోగలుగుతారు. - ప్రతిఫలాన్ని ఆశించకుండ మంచిపనికి చేతనైనంత సహాయపడే వారు గొప్పవారు.
- నిన్నటి చేదు రోజే నీ విజయ పరంపరలో స్పూర్తి అవ్వాలి. నేటి నిరంతర కృషే
రేపటి భవిష్యత్తుకు నిచ్చెన అవుతుంది. - నీవు తప్పుదారిలో నడవకుండ, హెచ్చరించేవాడే నిజమైన స్నేహితుడు.
- క్రమశిక్షణగల వారినే విజయం ప్రేమిస్తుంది. వరిస్తుంది.
- ఏది ఉంచుకోవాలో, మరి ఏది పెంచుకోవాలో, ఏది వదిలించుకోవాలో
- తెలుసుకోగలగడమే విజ్ఞత.
- చేతిని ఎత్తి చూపడం కాదు. దాని స్థానంలో మంచిని ప్రతిష్టించడమే
నిజమైన సంస్కరణ. - నువ్వు ఎవరినైనా ప్రేమించావనుకో.. వాళ్ళు మానాన వారిని వదిలేయ్, అప్పుడు వాళ్ళే వెతుక్కుంటూ నీ దగ్గరకొస్తారు. ఒకవేళ రాలేదనుకో – అప్పుడు వారు నీ వారు కారనుకో.
మరిన్ని తెలుగు కోట్స్- Telugu Quotes
అద్బుతమైన తెలుగు కవితలు – Telugu Poetry
కడుబుబ్బా నవ్వించే జోక్స్- Telugu Jokes
Like and Share
+1
+1
+1
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.