Menu Close

ఓ వ్యక్తి దగ్గరకు ఒక ఆమె వచ్చి సర్ నా భర్త చనిపోయాడు-Best Stories in Telugu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Telugu Stories, Telugu Kadhalu, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu

నచ్చితే తప్పకుండా షేర్ చెయ్యండి

ఓ వ్యక్తి దగ్గరకు ఒక ఆమె వచ్చి సర్ నా భర్త చనిపోయాడు, నాకు ఇద్దరు పిల్లలు ఇన్ని రోజులు నేను నాలుగిళ్ళల్లో పనిచేస్తూ నా జీవనం సాగించాను. ఇప్పుడు కరోనా కాలం కావడంతో నన్ను పని మాన్పించారు. నాకు జీవన ఆధారం పోయింది.

ఎలాగైనా నాకు ఒక కుట్టుమిషన్ ఇప్పించగలిగితే నేను నా జీవనం సాగిస్తానని చెప్పింది. అతను అదే విషయాన్నీ సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా, ఒక వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది.

వారు నిజంగానే సహాయం పొందడానికి అర్హులేనా అని అడిగారు. అవునండి అని సమాధానం చెప్పడంతో సరే నేను కుట్టుమిషన్ తీసిస్తాను మీ నెంబర్ కు డబ్బులు పంపిస్తాను అని చెప్పాడు.

వద్దు సర్ మీరు ఆ కుట్టుమిషన్ ఉన్న షాప్ యజమానికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అని అతని నెంబర్ ఇచ్చాడు. చిన్న ఆటో మాట్లాడుకుని వెళ్ళి కుట్టుమిషన్ తీసుకుని వారికి ఆ మిషన్ కు సంబంధించి దారాలు సూది ఇతర అవసరమైన వస్తువులతో పాటు నెలకు సరిపడే సరుకులు తీసుకుని వెళ్ళి ఆమె ఇంటి ముందు ఆగగా ఆమె ఆశ్చర్యపోయి కనీళ్ళు పెట్టుకుంది.

ఆమెకు సాయం చేసిన వ్యక్తిని చూపించడం కోసం వాట్సాప్ వీడియో కాల్ చేయగా అవతలి వ్యక్తిని చూసి ఆశ్చర్యం. ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా బాగా సెటిల్ అయిన వ్యక్తి అయిఉంటాడని అనుకున్న అందరికి ఆశ్చర్యం.

telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes
India, Adult, Adults Only, Antique

అతను 25 ఏళ్ళ పిల్లాడు ఒక సైకిల్ పైన వీధి వీధి తిరుగుతూ టీ అమ్ముతున్నాడు. అతని యజమాని ఎవరైనా సాయం చేస్తున్నారేమో అని వెతికాడు ఎవరూ లేరు. ఇప్పుడు అతడి గురించి ఆరా తీయాలనే ఆలోచన పెరిగింది. చిన్న తనంలోనే తల్లితండ్రిని పోగొట్టుకుని ఆకలి బాధను అనుభవించాడు.

పుట్టిన ఊరు వదిలి వచ్చాడు నా అనేవాళ్ళు లేకపోవడంతో, ఇలా కష్టపడి పనిచేస్తూ వచ్చాడు ప్రతిరోజు అతను 20 మందికి ఆకలి తీర్చడం మొదలుపెట్టాడు. ఇతడి గురించి తెలుసుకున్న ఎంతోమంది సహాయం చేయ ముందుకు వచ్చి డబ్బులు ఇస్తామని చెప్పినా సున్నితంగా తిరస్కరించి ఆ సహాయాలను నిజంగా అర్హులైన వారికి వారిచేత ఇప్పిస్తుంటాడు.

అతడి ఆలోచనకు సలాం, అతడి నిస్వార్థపు సేవకు నమస్కరిస్తున్న. కష్టం తెలిసినవాడు ఆ కష్టాన్ని తీర్చాలని ముందుకు వచ్చాడు నిజంగా నిజాయితీగా కష్టపడేవాళ్ళకు దేవుడు ఎప్పుడూ తోడు ఉంటాడు.

సాయం చేసే మనసు ఉండలికాని ధనిక పేద చిన్న పెద్ద అనే తారతమ్యం లేదు.

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading