Menu Close

పాతబడ్డ చెడు జ్ణాపకాలు విడిచిపెడితే జీవితం ఆనందంగా ఉంటుంది – Best Stories in Telugu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Best Stories in Telugu

Best Stories in Telugu

ఓ రాజ్యంలో ఒక బిచ్చగాడు రాజభవనం దగ్గరలో ఉంటూ రోజూ, ఆ భవనంలోని రాజుగారిని దూరం నుండి చూస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజుగారు అందరికీ విందు ఇస్తున్నారు అనేవార్త విన్నాడు. ఇది విన్న ఆ బిచ్చగాడికి ఒక ఆశ పుట్టింది. తన దుస్తులు చూసుకున్నాడు అన్నీ చిరిగిపోయాయి. ఎలాగైనా రాజుగారి నుండి మంచి దుస్తులు సంపాదించాలని అనుకున్నాడు.

రాజభవనము దగ్గరికి వెళ్లి కాపలా వారిని బతిమిలాడి, దర్బారులోకి ప్రవేశము సంపాదించాడు. ఎంతో ధైర్యం కూడగట్టుకొని, చాలా వినయంగా రాజు దర్భారులోకి ప్రవేశించాడు. అతన్ని చూడగానే రాజు.. “నీకేమి కావాలి” అని అడిగాడు. దానికి ఆ బిచ్చగాడు రాజు గారికి వంగి వంగి దండాలు పెడుతూ ఇట్లా అన్నాడు. “రాజా! నాకు మీరు ఇస్తున్న విందుకు రావాలని వుంది.

దయచేసి తమ పాత దుస్తులు ఇప్పిస్తే అవి ధరించి విందుకు వస్తాను. నా దగ్గర చినిగిన బట్టలు మాత్రమే ఉన్నాయి.”రాజుగారు వెంటనే తన పాత దుస్తులను తెప్పించి బిచ్చగాడికిస్తూ.. ఈ దుస్తులు చినిగిపోవు, మాసిపోవు వాటిపై దుమ్ము పడదు, ఎందుకంటే ఇవి ఎంతో ప్రత్యేకమైనవి. నీవు ఎప్పటికి వీటిని ధరించవచ్చు అన్నాడు.

బిచ్చగాడి కళ్ళ వెంట నీరు రాగా రాజుగారికి ధన్యవాదములు చెప్పాడు. ఆ దుస్తులు తన గదికి తెచ్చుకొని ధరించి అద్దములో చూచుకొని మురిసిపోయాడు బిచ్చగాడు. అయితే రాజు గారు ఎంత చెప్పినా, బిచ్చగాడికి ఆ రాజూ గారి దుస్తులు చినిగిపోతే ఎట్లా అనే భయం పట్టుకొంది .. ఎందుకైనా మంచిదని పాతదుస్తులన్నీ ఒక మూట కట్టి తనవెంట తెచ్చుకునే వాడు.

రాజు దుస్తులు చినిగితే తన పాత దుస్తులు ధరించవచ్చు అని. రాజుగారిచ్చిన విందు భోంచేస్తున్నంతసేపూ ఆనందంగా లేదు. బైట ఎక్కడో దాచిన తన పాత దుస్తుల మూట ఎవరన్నా ఎక్కడన్నా పారేస్తారేమో అని భయం. క్రమంగా రాజుగారి మాటలలోని సత్యం తెలిసివచ్చింది. ఎన్ని రోజులు ధరించినా దుమ్ము పడలేదు. కొత్తవిగానే వున్నాయి. కానీ తన పాత దుస్తులపై మమకారంతో ఆ మూట వదిలేవాడు కాదు.

అతని తోటి వారు అతనిని చూసి, ధరించిందేమో రాజు దుస్తులు మోసేదేమో పాత గుడ్డలు అని హేళన చేస్తూ , *పీలిక గుడ్డల మనిషి* అని పేరు పెట్టారు. చివరగా ఆ బిచ్చగాడు చనిపోవుటకు సిద్ధముగా ఉండి మంచంపై నుండి లేవలేక పోయేవాడు. పక్కనున్న జనాలు అతని తలగడ దగ్గర ఉన్న పాతబట్టల మూటను చూశారు. అది చూసి, ఎంత విలువైన చిరగని, తరగని దుస్తులు ధరించినా కూడా బిచ్చగాడికి, ఆ పాత బట్టల మూటపై వ్యామోహం పోలేదు.

వాటి సంరక్షణ కోసమే జీవితం అంతా గడిపి , ఏ రోజూ సంతోషమును పొందలేదు గదా ! అని బాధ పడ్డారు. ఇది ఒక బిచ్చగాడి కథ మాత్రమే కాదు! మనం అందరమూ కూడా ఈ అనుభవాల మూటలను పట్టుకొని, వదలకుండా మోస్తూ ఉంటాము.

Best Stories in Telugu

అవి ఏమిటంటే శత్రుత్వము, ఈర్ష్య , ద్వేషము , కోపము , తన బాధలు మొదలగునవి.. ఎన్నో జ్ఞాపకాలు. అంతే కాదు, ఈ భావనలతో మాటి మాటికీ దుర్గుణాలను, దుఃఖాన్ని గుర్తు తెచ్చుకుంటూ జీవితంలోని అందమైన , సంతోషమైన వాటిని అనుభవించలేము , గుర్తించలేము కూడా! ఎపుడో, ఎక్కడో జరిగిన సంఘటనలను ఎక్కడి కక్కడ, ఎప్పటి కప్పుడు వదలకుండా ఒక పెద్ద పనికిరాని పాతబట్టల మూటలాగా, ఆ జ్ఞాపకాల బరువును మోస్తూ ఉండటమే అనేక బాధలకు, అశాంతికి కారణము. అందుకే ఉన్నంతలో సంతోషంగా ఉంటూ.. పాతబడ్డ చెడు జ్ణాపకాలు విడిచిపెడితే జీవితం ఆనందంగా ఉంటుంది..🙏🏻

మంచి కథ కదా, తప్పకుండా షేర్ చెయ్యండి 🙏🏻🙏🏻🙏🏻

Like and Share
+1
3
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading