అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
దక్షిణ భారత దేశంలో కోట్లాది మది దోచిన కూరగాయల్లో మునగ (Drumsticks) ఒకటి. ఈ చెట్టు ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే. మునగ కాయలే కాకుండా ఆకులు కూడా చాలా బలమైన ఆహారం. అయితే మునగ ఆకుల కంటే మునగ కాయలను ఎక్కువగా వాడుతుంటారు. ముఖ్యంగా లైంగిక సామర్థ్యం పెంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
మునగ కాయలతోపాటు పుష్పాల, బెరడు, వేరు వంటి అన్ని భాగాలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మునగలో విటమిన్ ఎ, సి, లతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంది. నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగకు ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి.
ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి. విటమిన్ ఎ, సి (vitamin a and c), క్యాల్షియం, పొటాషియం ఇందులో ఎక్కువగా వుంటాయి. ఆకును కూడా వంటల్లో వినియోగిస్తారు. పచ్చటి ఆకులే కాక కొంచెం నీడలో ఎండబెట్టి, పొడిచేసి నిలువ కూడా వుంచుకోవచ్చు. అవసరమైనపుడు సంవత్సరం పొడవునా అందుబాటులో వుంటుంది.
అన్నిటికీ మించి సెక్స్ సమస్యల (sex problems) కు మునగ దివ్యౌషధంగా పనిచేస్తుంది. అంగస్తంభన సమర్థవంతంగా లేనివారు… మునగ చెట్టు ఎండిన బెరడును ఆవుపాలలో మరగించి కషాయం ఎండబెట్టాలి. ఆ పొడిని మూడు పూటలా నెల రోజులు తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి చక్కని అంగ స్తంభన అవుతుందని నిపుణులు చెబుతున్నారు.