Menu Close

Bangaram Techi Song Lyrics In Telugu – Iddaru Mitrulu

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Bangaram Techi Song Lyrics In Telugu – Iddaru Mitrulu

బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి
అందాల బొమ్మ గీయమ్మ
బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి
అందాల బొమ్మ గీయమ్మ

ఇన్నాళ్ళనుంచి కన్న కలలు తెచ్చి
అరుదైన రూపం ఈయమ్మ
పించెం కుంచెగ మారనీ
మురిపించే చిత్రం చూడనీ
వీరివీరి గుమ్మాడీ
వాడీ పేరేంటమ్మా అమ్మాయి, ఓ ఓ ఓఓ
బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి
అందాల బొమ్మ గీయమ్మ

జో లాలి అని కొత్త రాగాలెన్నో
పలుకమ్మా తీయగా
ఈ మంచు బొమ్మ పంచప్రాణాలతో
నిలువెల్లా విరియగా

అమ్మ అంటుంది కమ్మగా… పసిపాప తేనె పాట
అమ్మాయిగారు అమ్మగా పదవిని పొందునట
ఇల్లంతా బొమ్మల కొలువు
మనసంత నవ్వుల నెలవు, ఓఓ ఓ
బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి
అందాల బొమ్మ గీయమ్మ

అడగక ముందే అన్నీ చేసి… సేవకుడివనిపిస్తావు
అలసిన ఆశకి జీవం పోసి… దేవుడిలా కనిపిస్తావు
ఈ జన్మలోను నే తీర్చలేని… రుణమై బంధించావు
నీ స్నేహంతోనే చిగురించమని… వరమే అందించావు

ఎప్పుడూ నా కళ్ళు చూడనీ… వెలుగే చూపించినావు
ఎప్పుడు నా గుండె పాడనీ… మధురిమ నేర్పావు
నీలికళ్ళే చిందే తడిలో
హరివిల్లే రాని త్వరలో ఓఓ ఓ ఓ ఓ

ఆ ఆ ఆ ఓఓ… మాతృత్వానికి మగరూపానివై
నాన్నతనంలో కర్ణుడివై… అన్నగుణంలో కృష్ణుడివై
బతుకంతా జతగా నిలిచే విధివో… పతినే మించిన తోడువై
బంధుత్వాలకి అందని బంధం ఉందని చూపిన నేస్తమా

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading