1. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు, నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ.
2. అమరేంద్ర బాహుబలి అను నేను, అశేషమైన మాహిష్మతి ప్రజల ధన, మాన, ప్రాణ సంరక్షకుడిగా, ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని, రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
3. ఈ క్షణం నుంచి మరణం మనల్ని వేరు చేసే వరకు నేను నీ వాడిని దేవసేన. నా తల్లి నాకు నేర్పిన ధర్మం సాక్షిగా మాట యిస్తున్నాను నీ గౌరవ మర్యాదలకి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం వాటిల్లనివ్వను.
4. రాజు కాబోయేవాడు కోటా దాటి బయటకి వెళ్తేనే ప్రజల కష్ట సుఖాలు తెలుస్తాయి.
5. కాలం ప్రతి పిరికి వాడికి ధీరుడిగా మారే ఒక అవకాశం ఇస్తుంది. ఆ క్షణం ఇది. ప్రాణం పోసే వాడు దేవుడు, ప్రాణం నిలబెట్టే వాడు వైద్యుడు, ప్రాణం కాపాడే వాడు క్షత్రియుడు.
6. మన చేతులే మన కత్తులు, మన ఊపిరే పెను ఉప్పిన, మన నెత్తురే మన మహాసేన. జై మాహిష్మతి.
7. మీరు రాజు కాకపోవడానికి కారణం మీ అవిటి చెయ్యి కాదు ప్రభు, మీ అవిటి బుద్ది.
8. ఊరు వాడా చాటింపు వేయి తాతా, పిల్ల పెద్ద ముసలి ముతక అందరిని రమ్మన్నానని చెప్పు. కత్తి సుత్తి పలుగు పార గొడ్డలి గునపం ఏది దొరికితే అది ఆయుధంగ తీసుకు రమ్మని చెప్పు. ఈ రాజ్యానికి పట్టిన పీడా వదిలించడానికి రాజా మాత శివగామి దేవి మనవడు, అమరేంద్ర బాహుబలి వారసుడు మహేంద్ర బాహుబలి వచ్చాడు అని చెప్పు.
9. రాజ్యమాత శివగామి దేవి సాక్షిగా నా మొదటి ఆజ్ఞ – ఈ రాజ్యంలో నీతిగా, న్యాయంగా కష్టపడి పని చేసే ప్రతి పౌరుడు తల ఎత్తుకు తిరుగుతాడు. అలాంటి వాడికి అన్యాయం చేయాలని చూస్తే, ఎవ్వడి తలా అయినా తెగి పాతాళానికి పడిపోవాల్సిందే. ఇది నా మాట, నా మాటే శాసనం.
10. తప్పు చేశావ్ దేవసేన. ఆడ దాని మీద చేయి వేస్తే నరకాల్సింది వెళ్ళు కాదు, తల.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.