Menu Close

Are Emaindhi Lyrics in Telugu – Aaradhana


Are Emaindhi Lyrics in Telugu – Aaradhana

అరే ఏమైందీ…
అరే ఏమైందీ…
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ
అది ఏమైందీ…
తన మనిషిని వెదుకుతు ఇక్కడికొచ్చి వాలిందీ
కలగాని – కలఏదో
కళ్ళెదుటే నిలిచిందీ
అది నీలో మమతను నిద్దుర లేపిందీ అ…
అరే ఏమైందీ …
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ …
అది ఏమైందీ…?

చరణం: 1
నింగి వంగి నేలతోటి నేస్తమేదొ కోరింది
నేలపొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది
పూలునేను చూడలేను పూజలేవి చేయలేను
నేలపైన కాళ్ళులేవు నింగివైపు చూపులేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో
కాన రాణి గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావో… ఓ… ఓ…ఓ…

లలలల లా… లలలల లా…
లలలల లా… లలలల లా…
లలలల లా… లల లల లల లల లల లలలా

చరణం: 2
బీడులోన వానచినుకు పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతుతానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే పాట నీవు రాయగలవు
రాతరాని వాడిరాత దేవుడేమి రాశాడో
చేతనైతే మార్చిచూడు వీడుమారిపోతాడు
మనిషౌతాడు… ఉ… ఉ…ఉ

అరే ఏమైందీ…
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ
అది ఏమైందీ…
తనమనిషిని వెదుకుతు ఇక్కడికొచ్చి వాలిందీ…
కలగాని – కలఏదో
కళ్ళెదుటే నిలిచిందీ
అదినీలో మమతను నిద్దుర లేపింది
అరే ఏమైందీ…
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ…
అది ఏమైందీ…?

Are Emaindhi Lyrics in Telugu – Aaradhana

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading