Aparanji Madanude Lyrics in Telugu – Merupu Kalalu
అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే
వరిచేల మెరుపుల వజ్రమై రత్నమై వచ్చె వలపంటి వాడే
వినువీధిలో ఉంటె సూర్యుడే ఓడునే ఇల మీద ఒదిగినాడే
కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు శిశుపాలుడొచ్చినాడే
అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే..
అతడేమి అందగాడే
పోరాట భూమినే పూదోట కోనగా పులకింపజేసినాడే.. పులకింపజేసినాడే
కళ్యారిమలనేలు కలికి ముత్యపురాయి కన్నబిడ్డతడులేవే
నూరేళ్ళ చీకటి ఒకనాడే పోగొట్టి ఒడిలోన చేరినాడే
ఇరుకైన గుండెల్లో అనురాగమొలకగా నెలబాలుడొచ్చినాడే
ముక్కారు కాలంలో పుట్టాడు పూజకే పుష్పమై తోడు నాకై
అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే..
అతడేమి అందగాడే
వరిచేల మెరుపుల వజ్రమై రత్నమై వచ్చె వలపంటి వాడే..
వచ్చె వలపంటి వాడే
అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే..
అతడేమి అందగాడే
వరిచేల మెరుపుల వజ్రమై రత్నమై వచ్చె వలపంటి వాడే..
వచ్చె వలపంటి వాడే