ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
భౌతిక శాస్త్ర సూత్రాలనుసరించి.
చీమే కాదు ఏ వస్తువయినా కింద పడుతుందీ అంటే దానిక్కారణం గురుత్వాకర్షణ శక్తి కదా ,అయితే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ పడే వస్తువు యొక్క బరువుని బట్టే నేలను తాకంగానే ఉండే ఉధృతి ఆధారపడుతుంది.
అంటే ఎక్కువ బరువు ఉంటే డ్యామేజీ ఎక్కువ అని లేదా నొప్పి కూడా ఎక్కువే ఉండొచ్చని అనుకోవచ్చు.
అలాగే క్రింద పడే ఒక వస్తువు యొక్క వైశాల్యం (సర్ఫేస్ ఏరియా)ని బట్టి కూడా క్రింద పడే వేగం మారుతుంది.
ఎలాగంటే??
ఒక వస్తువు యొక్క వైశాల్యం (సర్ఫేస్ ఏరియా) ఎక్కువ అనుకుందాం, వస్తువు పడే ఎత్తు – నేల మధ్యలో ఉండే గాలి , వల్ల సర్ఫేస్ ఏరియా ఎక్కువ అయ్యే కొద్దీ రెసిస్టెన్స్ కూడా పెరిగి , అది పడే వేగం తగ్గిపోతుంది,అలా జాగ్రత్తగా నేల మీద పడే అవకాశం పెరుగుతుంది. ఇలా తక్కువ వేగంతో పడడం వల్ల కూడా డామేజీ తగ్గుతుంది.
ఇదే సూత్రం పేరాచ్యూట్ కీ ఇంకా పేరాగ్లైడింగ్ కీ కూడా వర్తిస్తుంది. ఎక్కువ వైశాల్యం ఉన్న గుడ్డ దాదాపు వంద కిలోల పైనే ఉండే ఇద్దరు మనుషులను జాగ్రత్తగా నేల మీదకు దింపుతాయి కదా.
పై సూత్రం ప్రకారం అత్యల్ప బరువు ఉండే చీమ కాస్త ఎత్తునుండి పడినా వెంటనే లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. పిపీలిక శాస్త్ర ప్రకారం వాటి శరీర నిర్మాణం కూడా ఇందుకు కారణం.వీటి శరీర నిర్మాణం ఎక్సో స్కెలిటన్ల తో జరుగుతుంది.
ఒకవేళ పెద్ద పరిమాణంలో ఉండే గండు చీమలు , పుల్ల చీమలు, కరెంటు చీమలకు దెబ్బలూ ,నొప్పి ఉంటాయేమో మనకు ఇంకా తెలియదు.