ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Annayya Annavante Song Lyrics In Telugu – Annavaram
అన్నయ్యా అన్నావంటే ఎదురవనా
అలుపై ఉన్నావంటే నిదరవనా
కలలే కన్నావంటే నిజమై ముందుకిరానా
కలతై ఉన్నావంటే కధనవనా
అమ్మలో ఉండే సగం… అక్షరం నేనే
నాన్నలో రెండో సగం… లక్షణం నేనే
అమ్మతోడు నాన్నతోడు… అన్నీ నీకు అన్నే తోడు
చెల్లిపోని బంధం నేనమ్మా… చిట్టి చెల్లమా
వెళ్ళిపోని చుట్టం నేనమ్మా
అన్నలోని ప్రాణం నువమ్మా… చిట్టి చెల్లెమ్మా
ప్రాణమైనా చెల్లిస్తానమ్మా
చూపులోన దీపావళి… నవ్వులోన రంగోళి
పండగలు నీతో రావాలి… నా గుండెలోన వేడుక కావాలి
రూపులోన బంగారు తల్లి… మాట మరుమల్లి
రామునింట ప్రేమని పంచాలి… ఆ సీత లాగ పేరుపు రావాలి
నీలాంటి అన్నగాని ముందే ఉంటే తోడునీడ
ఆనాటి సీత కన్ని కష్టాలన్ని కలిగుండేవా
వాహ్..! చెల్లిపోని బంధం నేనమ్మా… చిట్టి చెల్లమా
వెళ్ళిపోని చుట్టం నేనమ్మా
అన్నలోని ప్రాణం నువమ్మా… చిట్టి చెల్లెమ్మా
ప్రాణమైనా చెల్లిస్తానమ్మా
కాలికింది నేలను నేనే… నీలినింగి నేనే
కన్నుల్లోని నీరే నేనమ్మ… ఆ నన్ను నువ్వు జారనీకమ్మ
ఇంటిచుట్టు గాలిని నేనే… తోరణాన్ని నేనే
తులసిచెట్టు కోటను నేనమ్మా… నీ కాపలాగ మారనీవమ్మా
ముక్కోటి దేవతల అందే వరం అన్నవరం
ఇంటింటి అన్నతోడు అందరికుంటే భూమే స్వర్గం
చెల్లిపోని బంధం నేనమ్మా… చిట్టి చెల్లమా
వెళ్ళిపోని చుట్టం నేనమ్మా
అన్నలోని ప్రాణం నువమ్మా… చిట్టి చెల్లెమ్మా
ప్రాణమైనా చెల్లిస్తానమ్మా
అన్నయ్యా అన్నావంటే ఎదురవనా
అలుపై ఉన్నావంటే నిదరవనా
కలలే కన్నావంటే నిజమై ముందుకిరానా
కలతై ఉన్నావంటే కధనవనా
అమ్మలో ఉండే సగం… అక్షరం నేనే
నాన్నలో రెండో సగం… లక్షణం నేనే
అమ్మతోడు నాన్నతోడు… అన్నీ నీకు అన్నే తోడు
చెల్లిపోని బంధం నేనమ్మా… చిట్టి చెల్లమా
వెళ్ళిపోని చుట్టం నేనమ్మా
అన్నలోని ప్రాణం నువమ్మా… చిట్టి చెల్లెమ్మా
ప్రాణమైనా చెల్లిస్తానమ్మా