ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అందమైన రెండు కళ్ళు మాటలాడెనే
సరికొత్త భాష నాకు నేర్పెనే
స్వఛ్చమైన నవ్వు ఒకటి గుండె తాకెనే
అది నింగి దాటి నన్ను మోసెనే
ఇక నీడై నీ వెనుక… మొదలెట్టేసానే నడక
ఎటు చూసిన నువ్వే గనుక… వస్తున్నా ఆగలేక
నువు పక్కన ఉంటే రాతిరి కూడా రంగులమయమేలే
నువు వెళుతూ వెళుతూ తిరిగావంటే సంబరమేలే
మన మధ్యన ఓ వరస… కుదిరింది నీకు తెలుసా
నిను చూడకపోతే బహుశ… మనసే బరువేలే
తొలిసారిగ నిన్నే వలచా… ఎదపై నీ పేరుని రాసా
ప్రతి నిమిషం నిన్నే తలచా… మరువను నేనసలే
వెన్ ఐ సి యూ….
గుసగుసమని ఊహలు ఎన్నో… నేరుగ ఇప్పుడు కదిలేనా
ఈ సమయం హృదయం మరిచేనా
ముందుముందుగా ఈ అవకాశం… మల్లి నాకు దొరికేనా
మనసులోన మాటలు చెప్పెయ్నా
అంతులేని ఆనందం నన్ను చుట్టెనే
ఆపలేని ఆరాటం నిన్ను చూపెనే
మన మధ్యన ఓ వరస… కుదిరింది నీకు తెలుసా
నిను చూడకపోతే బహుశ… మనసే బరువేలే
తొలిసారిగ నిన్నే వలచా… ఎదపై నీ పేరుని రాసా
ప్రతి నిమిషం నిన్నే తలచా… మరువను నేనసలే
పదపదమని పరుగులు తీసెను… నీతో పాదం జతలోన
పరవశమే పొందెను ఎంతైనా
కలలో నేననుకోలేదు ఇంతటి హాయి నాదేనా
అవుతుందని సొంతం ఎపుడైనా
ఎన్ని జన్మలైనా నీతో ఉండాలనే
అనిపించెను నాలోన, ఎలా చెప్పనే
మన మధ్యన ఓ వరస… కుదిరింది నీకు తెలుసా
నిను చూడకపోతే బహుశ… మనసే బరువేలే
తొలిసారిగ నిన్నే వలచా… ఎదపై నీ పేరుని రాసా
ప్రతి నిమిషం నిన్నే తలచా… మరువను నేనసలే