ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అందమైన లోకం… అందులోన నువ్వు అద్భుతం
అందుకేగ నిన్నే కోరుకుంది… చిన్ని ప్రాణం
అందమైన భావం… అందులో నువు మొదటి అక్షరం
అందుకేగ నీతో… సాగుతోంది చిన్ని పాదం
ఓ చెలీ అనార్కలీ… నీ నవ్వులే దీపావళీ
పేరుకే నేనున్నదీ… నా ఊపిరే నువ్వే మరీ
చందమామనెవ్వరైన పట్టపగలు చూడగలర… నిన్ను నేను చూసినట్టుగా
అందమైనలోకం అందులోన… నువ్వు అద్భుతం
అందుకేగ నిన్నే… కోరుకుంది చిన్ని ప్రాణం
ఓర చూపుకి లొంగిపోవడం… దోరనవ్వుకే పొంగిపోవడం
ప్రేమలోనే నేర్చుకున్నా… రాతిరంతా మేలుకోవడం
నిన్ను నాలో దాచుకోవడం… నన్ను నీలో చూసుకోవడం
నమ్మలేక నన్నునేనే… అప్పుడప్పుడు గిల్లుకోవడం
ఓ చెలీ అనార్కలీ… బాగున్నదీ హడావిడీ
నేనిలా వినాలనే… ఇన్నాళ్ళ నుంచి కలలు కన్నదీ
అందమైన లోకం అందులోన… నువ్వు అద్భుతం
అందుకేగ నిన్నే… కోరుకుంది చిన్ని ప్రాణం
పూటపూటకు పండగవ్వడం… మాటిమాటికి నవ్వుకోవడం
ప్రేమలోన తేలుతుంటే… కష్టమేలే తట్టుకోవడం
దిండునేమో హత్తుకోవడం… జుట్టు రింగులు తిప్పుకోవడం
ప్రేమపిచ్చే రేగుతుంటే… తప్పదేమో దారి తప్పడం
ఓ చెలీ అనార్కలీ… తమాషగుందిలే ఇదీ
అందుకే సరాసరీ… మనస్సు ఇచ్చిపుచ్చుకున్నదీ
అందమైన లోకం అందులోన… నువ్వు అద్భుతం
అందుకేగ నిన్నే… కోరుకుంది చిన్ని ప్రాణం