Menu Close

Andama Anduma Song In Telugu – Govinda Govinda


Andama Anduma Song In Telugu – Govinda Govinda

అందమా అందుమా… అందనంటె అందమా
చైత్రమా చేరుమా… చేరనంటె న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ… పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ… పాల సంద్రమా

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

అందమా అందుమా అందనంటె అందమా
చైత్రమా చేరుమ్మ చేరనంటె న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
ఆడుమా పాడుమా… మౌనమే మానుకోవమ్మ
అందమా అందుమా… అందనంటె అందమా

ఆకలుండదే దాహముండదే… ఆకతాయి కోరిక, కొరుక్కుతింటదే
ఆగనంటదే దాగనంటదే… ఆకుచాటు వేడుక, కిరుక్కెమంటదే
వెన్నపూలు విన్నపాలు వినానమ్మి
చిటికనేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి
రాసి పెట్టి ఉందిగనక నిన్నే నమ్మి
ఊసులన్ని పూసగుచ్చి ఇస్తసుమ్మి
ఆలనా పాలనా… చూడగా చేరనా చెంత

అందమా అందుమా… అందనంటె అందమా
చైత్రమా చేరుమా… చేరనంటె న్యాయమా

వెయ్యి చెప్పినా లక్ష చెప్పినా
లక్ష్య పెట్టదే ఇల, ఇదేమి విలవిలా
తియ్య తియ్యగా నచ్చ చెప్పనీ
చిచ్చి కొట్టనీ ఇల, వయ్యారి వెన్నెలా
నిలవనీదు నిదరపోదు నారాయణ
వగల మారి వయసు పోరు నా వల్లన
చిలిపి ఆశ చిటికలోన తీర్చేయనా
మంత్రమేసి మంచి చేసి లాలించనా

ఆదుకో నాయనా… ఆర్చవా తీర్చవా చింత
అందమా అందుమా… అందనంటె అందమా
చైత్రమా చేరుమా… చేరనంటె న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ… పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ… పాల సంద్రమా
ఆడుమా పాడుమా… మౌనమే మానుకోవమ్మ

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading