Menu Close

Anandam Neelone Lyrics In Telugu – Telugu Christian Songs

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Anandam Neelone Lyrics In Telugu – Telugu Christian Songs

ఆనందం నీలోనే… ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే… నా యేసయ్యా, ​స్తోత్రార్హుడా
ఆనందం నీలోనే… ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే… నా యేసయ్యా, ​స్తోత్రార్హుడా
అర్హతే లేని నన్ను ప్రేమించినావు…
జీవింతునిలలో నీకోసమే… సాక్షార్థమై

ఆనందం నీలోనే… ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే… నా యేసయ్యా, ​స్తోత్రార్హుడా

పదేపదే నిన్నే చేరగా… ప్రతిక్షణం నీవే ధ్యాసగా||2||
కలవరాల కోటలో… కన్నీటి బాటలో ||2||
కాపాడే కవచంగా… నను ఆదరించిన
దివ్య క్షేత్రమా… స్తోత్ర గీతమా

ఆనందం నీలోనే… ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే… నా యేసయ్యా, ​స్తోత్రార్హుడా

నిరంతరం నీవే వెలుగుని – నిత్యమైన స్వాస్థ్యం నీదని ||2||
నీ సన్నిధి వీడక… సన్నుతించి పాడనా ||2||
నీ కొరకే ధ్వజమెత్తి… నిన్ను ప్రకటించనా
సత్య వాక్యమే… జీవ వాక్యమే

ఆనందం నీలోనే… ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే… నా యేసయ్యా, ​స్తోత్రార్హుడా

సర్వసత్యమే నా మార్గమై… సంఘక్షేమమే నా ప్రాణమై ||2||
లోకమహిమ చూడక… నీ జాడను వీడక ||2||
నీతోనే నిలవాలి… నిత్య సీయోనులో
నీ దర్శనం నా ఆశయం…

ఆనందం నీలోనే… ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే… నా యేసయ్యా, ​స్తోత్రార్హుడా

Anandam Neelone Lyrics In Telugu – Telugu Christian Songs

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading