Menu Close

Amma Brahma Devudo Lyrics In Telugu – Govinda Govinda

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Amma Brahma Devudo Lyrics In Telugu – Govinda Govinda

హుయ్ ఢముకెయ్ డుం డుం డిగా… సందడి సెయ్ తమాషగా
అంగరంగ వైభోగంగా సంబరం… వీధుల్లో సేరి సివమెత్తంగా
హుయ్..! దరువెయ్ తధినకా… అడుగేయ్రా అదిలెక్కా
సామిరంగా సిందాడంగా… సీనయ్య ఏడుకొండలు దిగి కిందికిరాగా

అమ్మ బ్రహ్మ దేవుడో… కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో… యాడ దాచినావురో
పూల రెక్కలు… కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో
ఇలా బొమ్మ చేస్తివో…
అసలు భూలోకం… ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం… స్వర్గానికి చెంది ఉంటదా

కనురెప్పలు పడనప్పుడు… కల కళ్లపడదుగా
కనుకిప్పుడు ఎదరున్నది… కల్లై పోదుగా
ఒహొహొ ఒహొ ఓహో ఓహో… ఒహొహొ ఒహొ ఓహో
కనురెప్పలు పడనప్పుడు… కల కళ్లపడదుగా
కనుకిప్పుడు ఎదరున్నది… కల్లై పోదుగా
ఒకటై సిన్నా పెద్దా… అంతా చుట్టూ చేరండి
తకథై ఆటాడించే… చోద్యం చూడండి

చంద్రుళ్లో కుందేలు… సందెల్లో అందాలు
మన ముంగిట్లో… కథాకళి ఆడేనా

అసలు భూలోకం… ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం… స్వర్గానికి చెంది ఉంటదా
అమ్మ బ్రహ్మ దేవుడో… అరె కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో… యాడ దాచినావురో

మహ గొప్పగ మురిపించగ… సరికొత్త సంగతి
తల తిప్పగ మనసొప్పక… నిలిచే జాబిలి
ఒహొహొ ఒహొ ఓహో ఓహో… ఒహొహొ ఒహొ ఓహో
మహ గొప్పగ మురిపించగ… సరికొత్త సంగతి
తల తిప్పగ మనసొప్పక… నిలిచే జాబిలి
అప్పన్న తన్నామన్నా… కధం తొక్కే పదానా
తప్పన్న తనా మనా… తేడా లేదోయ్ నా

తందానా తాళానా… కిందైనా మీదైనా
తలవంచేనా తెల్లారులూ తిల్లానా

హాయ్.. హాయ్.. హాయ్
అసలు భూలోకం… ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం… స్వర్గానికి చెంది ఉంటదా
అమ్మ బ్రహ్మ దేవుడో… కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో… యాడ దాచినావురో
పూల రెక్కలు… కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో
ఇలా బొమ్మ చేస్తివో…
అసలు భూలోకం… ఇలాంటి సిరి చూసి ఉంటదా

హుయ్ ఢముకెయ్ డుం డుం డిగా… సందడి సెయ్ తమాషగా
అంగరంగ వైభోగంగా సంబరం… వీధుల్లో సేరి సివమెత్తంగా
హుయ్..! దరువేయ్ తధినకా… అడుగేయ్రా అదిలెక్కా
సామిరంగా సిందాడంగా… సీనయ్య ఏడుకొండలు దిగి కిందికిరాగా

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading