ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అమ్మా, అవనీ…
అమ్మా, అవనీ, నేలతల్లీ… అని ఎన్నిసార్లు పిలిచినా
తనివి తీరదేందుకనీ…
అమ్మా, అవనీ, నేలతల్లీ… అని ఎన్నిసార్లు పిలిచినా
తనివి తీరదేందుకనీ…
కనిపెంచిన ఒడిలోనే… కన్నుమూయనీ
మళ్లీ ఈ గుడిలోనే… కళ్ళు తెరవనీ
అమ్మా, అవనీ, నేలతల్లీ… అని ఎన్నిసార్లు పిలిచినా
తనివి తీరదేందుకనీ…
తల్లీ నిను తాకితేనె… తనువు పులకరిస్తుందీ
నీ ఎదపై వాలితేనే… మేను పరవశిస్తుందీ
తేట తెలుగు జాణా… కోటి రతనాల వీణా
నీ పదములాన నోవె.. నాకు స్వర్గం కన్నా మిన్నా
అమ్మా, అవనీ, నేలతల్లీ… అని ఎన్నిసార్లు పిలిచినా
తనివి తీరదేందుకనీ… అమ్మా, అవనీ
నీ బిడ్డల శౌర్య ధైర్య సాహస గాధలు వింటే
నరనరాలలో రక్తం… పొంగి పొరలుతుందీ
రిగగ రిగగ రిగ రిగగ రిగగ రిగ
రిగగ రిగగ రిగ రిగ రిస దప దస
రిగగ రిపపప గదదద పదదద
సద సద పగ పగ సద సద సద సద
పద సద పద సద పద సద పద సద
సాస సాస సాస సాస రీరి
సాస సాస సాస సాస గాగ
రిగ రిస రిగ రిస… రిగ రిస రిగ రిస
సరి సరి గా రిస… గా రిస గా రిస
రిగ రిగ పా… గరి సగ పా
గప పద దస సరి గరిసద
పద దస సరి రిగ మగసరి
రీ గా మా రిస దప దస రిగ పా
సరి గప దస రిగ పా… గప గరి సరి సగ
ధీర మాతవమ్మా… రణ ధీర చరితవమ్మా
పుణ్య భూమివమ్మా… నువు ధన్య చరితవమ్మా
తల్లి కొరకు చేసె… ఆ త్యాగమెంతదైనా
దేహమైన ప్రాణమైన… కొంచమే కదమ్మా
అది మించిన నాదన్నది… నీకీగలదేదమ్మా
అమ్మా, అవనీ, నేలతల్లీ… అని ఎన్నిసార్లు పిలిచినా
తనివి తీరదేందుకనీ… అమ్మా, అవనీ