ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
జోలాలిజో లాలిలాలి జోలాలిజో
అమ్మా అని పిలిచి పిలిచి… గుండె పిండకురా
ఆకలని ఏడ్చి… నన్ను ఏడిపించకురా
గర్భగుడిలాంటి అమ్మ ఒడి… పాము పడగయ్యిందిరా
చెప్పలేని గుండె కోత ఇది… కాస్త జాలి పడరా
అమ్మా అని పిలిచి పిలిచి… గుండె పిండకురా
విషం కూడ అమృతమే… అమ్మ తాకితే
నీ తల్లిపాలు విషమురా… నువ్వు తాగితే
అంటరాని కన్నతల్లిగా… చేశాడురా బ్రహ్మ
ముద్దు ముచ్చటలు తీర్చగా… నోచుకోని జన్మ
రమ్మనలేను చేరగ నేను శిలను నేనురా..!!
అమ్మా అని పిలిచి పిలిచి… గుండె పిండకురా
లాలిజో లాలి లాలిజో… లాలిజో లాలిజో
కంటీ నీటితోనే… నీ కడుపునింపుకో
ఒంటరితనమే తోడుగా… నడక నేర్చుకో
సింహరాశిలో పుట్టిన… సూర్యుడే నీవురా
నిన్ను మోసి కన్న ఆశలే… నీకు దీవెనవవా
అందరి కంటి కాంతిగ మారి… ముందుకు సాగరా
అమ్మా అని పిలిచి పిలిచి… గుండె పిండకురా
ఆకలని ఏడ్చి… నన్ను ఏడిపించకురా
గర్భగుడిలాంటి అమ్మ ఒడి… పాము పడగయ్యిందిరా
చెప్పలేని గుండె కోత ఇది… కాస్త జాలి పడరా