Menu Close

ప్రళయం వచ్చి మనుషులు అంతరించిపోయినా, భూమిపై బతికే ఏకైక జీవి ఇదే..!


సాధారణంగా ఉష్ణోగ్రత 50 దాటితేనే మనుషులు భరించలేరు. అలాంటిది 150 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయితే ఈ భూమిపై మనుషులు అన్నవారే ఉండదు. ఇక మైనస్ 457 డిగ్రీల చలి ఉంటే.. ఎన్నో జీవులు ప్రాణాలు కోల్పోతాయి.

ప్రళయం వచ్చి మనుషులు అంతరించిపోయినా.. భూమిపై బతికే ఏకైక జీవి ఇదే..!

ఏదైనా ప్రళయం వచ్చి మానవ జాతి భూమి నుంచి తుడిచిపెట్టుకుపోయిన తర్వాత కూడా.. ఈ అర మిల్లీమీటరు జీవి మాత్రం ఇక్కడ హాయిగా జీవించ గలదు. సూర్యుడు నాశనమయ్యే వరకు ఈ జీవి చావదు. అంతేకాదు ఈ జంతువు ఆహారం, నీరు లేకుండా 30 సంవత్సరాలు బతికేస్తుంది.

అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ ఈ జీవులు.. మనుగడ చేయగలదు. ఇది పూర్తిగా చనిపోవాలి అంటే సూర్యుడు పూర్తిగా నాశనం అవ్వాలి. భూమి మొత్తం చీకటితో నిండినప్పుడు మాత్రమే ఇది చనిపోతుంది.

ఈ జంతువును టార్డిగ్రేడ్ అంటారు. తెలుగులో దీన్ని నీటి ఎలుగుబంటి అంటారు. ఈ జీవి ప్రపంచం అంతమయ్యే వరకు జీవిస్తుంది. నీటి ఎలుగుబంటికి అంత శక్తి ఉందా అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఆహారం నీరు లేకుండా 30 సంవత్సరాలు జీవిస్తుంది.

ఈ నీటి ఎలుగుబంటి పొడవు కేవలం 0.5 మిల్లీమీటర్లు మాత్రమే. అందువలన దీనిని మనుషులు తమ కళ్లతో చూడలేరు. మరుగుతున్న నీటిలో ఉడకబెట్టినా.. మంచులో గడ్డకట్టినా ఈ జీవి 200 సంవత్సరాలు జీవించగలదు.

నిజానికి ఏదైనా గ్రహ శకలం భూమిని ఢీ కొడితే సర్వం నాశనం అవుతాయి. లేదా ఏదైనా నక్షత్రం పేలినప్పుడు గామ కిరణాలు విడుదలై భూమి మొత్తం తుడుచుపెట్టుకు పోతంది. అయితే అలాంటి సమయంలో కూడా నీటి ఎలుగుబంటి మాత్రమే మనుగడ సాగిస్తాయి.

Share with your friends & family
Posted in Interesting Facts

Subscribe for latest updates

Loading