ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అల్లసాని వారి పద్యమా
విశ్వనాధ వారి ముత్యమా, ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా
త్యాగరాజ సంగీతమా గీతమా ||2||
పోలికే లేని పాటలా
నువ్వు పిలిచావు నన్నిలా
చిన్ని చిరునవ్వు లేత చిగురాశ
మళ్లీ పూసాయిలే ఇలా
డి డి డి డెస్టినీ
లైఫే మారిందని… ఏదో జరిగిందని
ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ సో హెవన్లీ ||2||
హో..! అల్లసాని వారి పద్యమా
విశ్వనాధ వారి ముత్యమా, ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా
త్యాగరాజ సంగీతమా గీతమా
నీడలా నువ్వొచ్చి వెంట వాలగా
గుండెలో ఉయ్యాలూగినట్టుగా
గొంతులో స్వరాల మూగ పిలుపులే, సందడి చేసేనా
తోడులా నువ్వొచ్చి దగ్గరవ్వగా
ఇంతలో ఎన్నెన్ని వింతలో ఇలా
కాంతులా కలల్ని జల్లినట్టుగా, ప్రాణం మురిసెనా
తేనెలో ఉన్న తియ్యనా… భాషలో ఉన్న లాలనా
కుమ్మరిస్తున్న పొంగిపోతున్న… నిన్ను కలిసేటి వేళనా
కాలమే దోబూచులాడుతున్నదో… కానుకే క్షణాలు పంచుతున్నదో
కారణం ఊహించనివ్వనన్నదో ఏమవుతున్నదో
స్వప్నమే నిజంగా మారుతున్నదో… సాగరం నదల్లే పారుతున్నదో
సత్యమే ఇదంత నమ్మమన్నదో ఏమంటున్నదో
మరిచిపోయాను నన్నిలా… మరిచిపోలేక నిన్నిలా
లేత ప్రాయాల పాత ప్రణయాలే… కొత్తగా పూతలేసేలా
డి డి డి డెస్టినీ
లైఫే మారిందని ఏదో జరిగిందని
ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ సో హెవన్లీ ||2||