Menu Close

Akhilanda Koti Lyrics in Telugu – Om Namo Venkatesaya


Akhilanda Koti Lyrics in Telugu – Om Namo Venkatesaya

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలకా
గోవిందా గోవిందా పువ్వు పున్నమివెన్నెల్ల గోవిందా
గోవిందా గోవిందా చిన్ని తోమాల సేవల గోవిందా
గోవిందా గోవిందా…
వినా వేంకటేశం ననాతో ననాత
సదా వేంకటేశం స్మరామి స్మరామి

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలకా

శ్రీ వేంకటేశ శ్రీత సంవంద
సేవా భాగ్యం దేహి ముకుంద

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలకా

తిరుపదములకు తిరువడి రండను
శ్రీ భూ సతులకు సిరి హారములు
తిరుపదములకు తిరువడి రండను
శ్రీ భూ సతులకు సిరి హారములు

ఆకళంక శంఖ చక్రాలకు
అపురూప కుసుమమాలికలు
ఆజానుబాహుపర్యంతము
అలరుల తావళ హారములు

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలకా
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలకా

మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు
చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు
కలువలు కమలాలు కనకాంబరాలు
పొన్నా పొగడ మొల్ల మొగలి గులాబీలు
మరువం దవనం మావి మాచి
వట్టి వేరు కురువేరులు
గరుడ గన్నేరు నందివర్ధనాలు
హరిత హరిద్ర బిల్వ తులసీదళాలు
నీకోసం విరిసే నిను చూసి మురిసే
నీ మేను తాకి మెరిసే…

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
ఆనంద నిలయ వర పరిపాలకా

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading