ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Aha Kanne Chilaka Lyrics In Telugu – Kalyana Ramudu
ఆహా ఆహా అహహా హహా హా
ఆహా ఆహా అహహా ఆహా
ఆహా ఆహా అహహా హహా హా
ఆహా కన్నె చిలకా… అహహా కోరి వచ్చా, హో హో హె
నీకే మనసు ఇచ్చా… అందుకే కోరి వచ్చా
నాలో ప్రాణం నీవనీ… నిజమనీ వలపుల పాటలు పాడ వచ్చా
నీకే మనసు ఇచ్చా… అందుకే కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా … అందుకే కోరి వచ్చా
గాడిద పోలిన నడకలో… ఆ కాకిని పోలిన గొంతులో, అ ఆ
హంసను మించిన నడకలో… కోకిలనే మించిన గొంతులో
ఆశలు పొంగే, పొంగి పొంగే… ఆశలు పొంగే, పొంగి పొంగే
ఆ తరువాతా మరచిపోయా
ఆ జ్ఞాపకం వచ్చె నాకూ… నీవు నా చిట్టి రాణీ
నీకే మనసు ఇచ్చా… అందుకే కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా… అందుకే కోరి వచ్చా
తీయని ముద్దొకటి ఇవ్వరాదే… నా కోరిక తీర్చుట తప్పుకాదే, ఆహ్హా
తీయని ముద్దొకటి ఇవ్వరాదే… నా కోరిక తీర్చుట తప్పుకాదే
చక్కని చిలకా, టక్కరి నక్కా… అయ్యయ్యయ్యో మరచిపోయా
ఆ..! చక్కని చిలకా, టక్కరి జింక… రంగుల రవ్వా, జాజి పువ్వా
ఆ..! మనసు ఇచ్చా… మోజే మోసుకొచ్చా
నీకే మనసు ఇచ్చా… అందుకే కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా… అందుకే కోరి వచ్చా
తరగని ఊహలు రేగెనే… నా తలపులు ఊయలలూగెనే
తరగని ఊహలు రేగెనే… నా తలపులు ఊయలలూగెనే
కనికరించీ, పలకరించీ… చేర రావే కలిసిపోవే
పాడవేల నాతో తోడుగా చిట్టిరాణీ
నీకే మనసు ఇచ్చా… అందుకే కోరి వచ్చా
నాలో ప్రాణం నీవనీ… నిజమనీ వలపుల పాటలు పాడ వచ్చా