Menu Close

Ae Paapamerugani Song Lyrics in Telugu – Christian Songs Lyrics

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Ae Paapamerugani Song Lyrics in Telugu – Christian Songs Lyrics

ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా
నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా

ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా
ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా ||ఏ పాప||

కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా
సిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా ||ఏ పాప||

చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా
కడకు కల్వరి గిరి – కడ కేగి సిల్వను – గ్రక్కున దించినావా ||ఏ పాప||

ఆ కాల కర్ములు – భీకరంబుగ నిన్ను – ఆ కొయ్యపై నుంచిరా
నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది – మేకులతో గ్రుచ్చినారా ||ఏ పాప||

పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా
సిలువపై పలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా ||ఏ పాప||

బల్లిదుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క – జిల్లి బడ బొడచినాడా
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము ||ఏ పాప||

కట కటా పాప సం – కటము బాపుట కింత – పటు బాధ నొందినావా
ఎటువంటిదీ ప్రేమ – యెటువంటిదీ శాంత – మెటుల వర్ణింతు స్వామి ||ఏ పాప||

Ae Paapamerugani Song Lyrics in English – Christian Songs Lyrics

Ae Paapamerugani Yo Paavana Moorthy Paapa Vimochakundaa
Naa Paali Daivamaa Naa Paapamula Kora Kee Paatlu Nondinaavaa

Mullatho Kireeta – malli Nee Shiramupai – Jallaatamuna Moththiraa
Mulla Potlaku Shiramu – Thalladillaga Somma – sillipothiva Rakshakaa ||Ae Paapa||

Kaluvari Giri Danuka – Siluva Moyaleka – Kalavaramu Nondinaavaa
Siluva Neetho Moya – Thuluvalu Verokani – Thodugaa Nichchinaaraa ||Ae Paapa||

Chedugu Yoodulu Bettu – Padaraani Paatlaku – Sudivadi Nadachinaavaa
Kadaku Kalvari Giri – Kada Kegi Silvanu – Grakkuna Dinchinaavaa ||Ae Paapa||

Aa Kaala Karmulu – Bheekarambuga Ninnu – Aa Koyyapai Nunchiraa
Nee Kaalu Sethulu – Aa Koyyake Soodi – Mekulatho Gruchchinaaraa ||Ae Paapa||

Paluvidhambula Shramalu – Chelarega Dandriki – Nelugeththi Moralidithivaa
Siluvapai Palumaaru – Kaluguchundedi Baadha – Valana Daahamu Naayenaa ||Ae Paapa||

Ballidundagu Bantu – Ballemuna Nee Prakka – Jilli Bada Bodachinaadaa
Ullolamulavale Nalla Neerubukanga Jallaare Gada Kopamu ||Ae Paapa||

Kata Kataa Paapa San – katamu Baaputa Kintha – Patu Baadha Nondinaavaa
Etuvantidee Prema – Yetuvantidee Shaantha – Metula Varninthu Swaami ||Ae Paapa||

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading