ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Adani Group Stocks Crash – గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది.
భారత్‌లోనే రెండో అత్యంత ధనవంతుడు, దిగ్గజ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్‌లో కేసు నమోదైంది. మల్టీబిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ సహా మరో ఏడుగురు ఈ స్కీంలో నిందితులుగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థలు రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ నవంబర్ 21న నివేదించాయి. సోలార్ ఎనర్జీ కాంట్రాక్టుల్ని దక్కించుకునేందుకు ఈ క్రమంలోనే అదానీ గ్రూప్.. భారత ప్రభుత్వ అధికారులకు పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చినట్లు అభియోగాలు మోపారు. ఇటీవల గౌతమ్ అదానీ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా ఆయనపై అక్కడ కేసు నమోదవడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్‌కు అభినందనలు తెలిపిన తర్వాత అదానీ.. గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడుల్ని ప్రకటించినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఇటీవల ట్రంప్ ఎనర్జీ కంపెనీలకు నిబంధనల్ని సడలించనున్నట్లు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
వీరు 20 సంవత్సరాలలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందే అవకాశం ఉన్న.. సౌరశక్తి సరఫరా ఒప్పందాల్ని పొందేందుకు భారత అధికారులకు .. 265 మిలియన్ డాలర్ల మేర లంచాలు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీలో.. అక్రమ మార్గాల ద్వారా.. ఆ కంపెనీ పెట్టుబడిదారులు, రుణ దాతల నుంచి సుమారు 3 బిలియన్ డాలర్లకుపైగా రుణాలు, బాండ్లు సేకరించిందని అభియోగాలు నమోదయ్యాయి.
యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమీషన్ ప్రకారం అదానీ.. అమెరికన్ ఇన్వెస్టర్లను మోసగించారని, అధికారులకు లంచాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. అదానీతో పాటుగా ఇందులో అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ అయిన ఆయన అల్లుడు సాగర్ అదానీ (30), అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ సిరిల్ క్యాబెన్స్ ప్రముఖంగా ఉన్నట్లు తెలిసింది.
తప్పుడు స్టేట్‌మెంట్లు, ప్రకటనల ద్వారా లబ్ధి పొందినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఫారెన్ బిజినెస్ డీలింగ్స్ కింద అమెరికాలో ఉన్న ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అభియోగాలు నమోదు చేశారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్, రంజిత్ గుప్తా, సిరిల్ క్యాబెన్స్, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా రూపేశ్ అగర్వాల్ వంటి వారిపై కేసులు నమోదయ్యాయి.
Why did Adani Group stocks crash?
Adani Group stocks crashed significantly on November 21, 2024, after the US indicted Gautam Adani and seven others on charges of bribery and fraud. This indictment raised concerns about the company’s financial health and corporate governance practices, leading to a sell-off by investors.
What is the impact of the Adani Group stock crash on the Indian market?
The Adani Group stock crash had a significant impact on the Indian market. The broader market indices, such as the Sensex and Nifty, also fell sharply due to the negative sentiment and concerns about the broader economic implications of the Adani Group’s troubles.
What is the future outlook for Adani Group stocks?
The future outlook for Adani Group stocks remains uncertain. The US legal proceedings against Gautam Adani and others could have significant implications for the company’s financial health and reputation. Investors are closely monitoring the situation and its potential impact on the company’s operations and future growth prospects.
What should investors do with their Adani Group stocks?
Investors should consult with their financial advisors to make informed decisions about their Adani Group stocks. Given the current situation, it is advisable to carefully assess the risks and potential rewards before making any investment decisions.
Is this the first time Adani Group stocks have faced such a significant decline?
No, this is not the first time Adani Group stocks have faced a significant decline. In January 2023, a report by Hindenburg Research also led to a sharp fall in Adani Group stocks.
What are the potential consequences of the US indictment for Adani Group?
The US indictment could lead to further investigations and legal proceedings against Adani Group, which could have significant financial and reputational consequences. The company may face increased scrutiny from regulators and lenders, which could impact its ability to raise capital and execute its business plans.
What are the lessons to be learned from the Adani Group stock crash?
The Adani Group stock crash highlights the importance of due diligence and risk management for investors. It also underscores the need for transparency and accountability in corporate governance. Investors should be cautious about investing in companies with opaque financial practices and a history of controversies.
Who is Gautam Adani?
Gautam Adani is an Indian billionaire businessman and the founder and chairman of the Adani Group, a diversified conglomerate with interests in ports, power generation, renewable energy, mining, and more.
What is the Hindenburg Research report?
Hindenburg Research is a US-based short-seller that published a report in January 2023 alleging that the Adani Group had engaged in stock manipulation and accounting fraud. The report led to a significant decline in Adani Group stocks and raised serious concerns about the company’s financial health and corporate governance practices.
How has the Indian government responded to the Adani Group crisis?
The Indian government has not directly intervened in the Adani Group crisis. However, the Securities and Exchange Board of India (SEBI) has been monitoring the situation and has taken steps to ensure market integrity. The government has also emphasized the importance of regulatory oversight and investor protection.
Adani Group Stocks Crash – గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది.