ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Abhinandhana Mandara Mala Lyrics In Telugu – Tandra Paparayudu
అభినందన మందారమాల
అభినందన మందారమాల… అభినందన మందారమాల
అధినాయక స్వాగతవేళ… అభినందన మందారమాల
స్త్రీ జాతికీ ఏనాటికీ… స్మరణీయ మహనీయ వీరాగ్రణికి
అభినందన మందారమాల… అధినాయక స్వాగతవేళ
అభినందన మందారమాల
వేయి వేణువులు నిన్నే పిలువగ
నీ పిలుపు నావైపు పయనించెనా
వేయి వేణువులు నిన్నే పిలువగ
నీ పిలుపు నావైపు పయనించెనా
వెన్నెల కన్నెలు… నిన్నే చూడగా
వెన్నెల కన్నెలు… నిన్నే చూడగా
నీ చూపు నా రూపు… వరియించెనా
నీ చూపు నా రూపు… వరియించెనా
నా గుండెపై నీవుండగా
దివి తానే భువిపైన దిగివచ్చెనా
అభినందన మందారమాల… అలివేణీ స్వాగతవేళ
అభినందన మందారమాల
సౌందర్యమూ, సౌశీల్యమూ నిలువెల్ల… నెలకొన్న కలభాషిణికి
అభినందన మందారమాల
వెండి కొండపై… వెలసిన దేవర
నెలవంక మెరిసింది… నీ కరుణలో
వెండి కొండపై… వెలసిన దేవర
నెలవంక మెరిసింది నీ కరుణలో
సగము మేనిలో… ఒదిగిన దేవత
సగము మేనిలో… ఒదిగిన దేవత
నునుసిగ్గు తొణికింది… నీ తనువులో
నునుసిగ్గు తొణికింది… నీ తనువులో
ప్రియ భావమే లయరూపమై
అలలెక్కి ఆడింది అణువణువులో
అభినందన మందారమాల… ఉభయాత్మల సంగమ వేళ
అభినందన మందారమాల