ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Aaraneekuma Ee Deepam Lyrics In Telugu – Karthika Deepam
ఆఆ ఆ ఆఆ ఆ… ఆఆ ఆ ఆఆ ఆ
ఆరనీకుమా ఈ దీపం… కార్తీక దీపం
చేరనీ నీ పాదపీఠం… కర్పూర దీపం
ఆరనీకుమా ఈ దీపం… కార్తీక దీపం
చేరనీ నీ పాదపీఠం… కర్పూరదీపం
ఇదే సుమా నా… కుంకుమ తిలకం
ఇదే సుమా నా… మంగళసూత్రం
ఆరనీకుమా ఈ దీపం… కార్తీక దీపం
చేరనీ నీ పాదపీఠం… కర్పూర దీపం
ఆఆ ఆ ఆఆ ఆ… ఆఆ ఆ ఆఆ ఆ
ఓఓ ఓ ఓఓ ఓ… ఓఓ ఓ ఓఓ ఓ
ఇంటిలోన నా పాప రూపున… గోరంత దీపం
కంటికెదురుగా కనబడు వేళల… కొండంత దీపం
ఇంటిలోన నా పాప రూపున… గోరంతదీపం
కంటికెదురుగా కనబడు వేళల… కొండంతదీపం
నా మనస్సులో వెలిగే దీపం… నా మనుగడ నడిపే దీపం
ఆరనీకుమా ఈ దీపం… కార్తీకదీపం
చేరనీ నీ పాదపీఠం… కర్పూరదీపం
ఆఆ ఆ ఆఆ ఆ… ఆఆ ఆ ఆఆ ఆ
ఆఆ ఆ ఆఆ ఆ… ఆ ఆఆ ఆఆ
ఆకాశాన ఆ మణిదీపాలే… ముత్తైదువులుంచారు
ఈ కోనేటా ఈ చిరుదివ్వెల… చూసి చుక్కలనుకుంటారు
ఆకాశాన ఆ మణిదీపాలే… ముత్తైదువులుంచారు
ఈ కోనేటా ఈ చిరుదివ్వెల… చూసి చుక్కలనుకుంటారు
ఏమైనా ఏదైనా… కోవెలలో కొలువై యుండే
దేవికి పట్టిన హారతులే…
ఆరనీకుమా ఈ దీపం… కార్తీక దీపం
చేరనీ నీ పాదపీఠం… కర్పూర దీపం
చేరనీ నీ పాదపీఠం… నా ప్రాణదీపం
ఆఆ ఆ ఆఆ ఆ… ఆఆ ఆ ఆఆ ఆ
ఆఆ ఆ ఆఆ ఆ… ఆ ఆఆ ఆఆ
నోచిన నోములు… పండెనని ఈ ఆనంద దీపం
నా దాచిన కోర్కెలు… నిండునని ఈ ఆశాదీపం
నా నోచిన నోములు… పండెనని ఈ ఆనందదీపం
నా దాచిన కోర్కెలు… నిండునని ఈ ఆశాదీపం
ఎటనైనా ఎప్పుడైనా… నే కొలిచే కళ్యాణదీపం
నే వలచే నా ప్రాణదీపం…
ఆరనీకుమా ఈ దీపం… కార్తీక దీపం
చేరనీ నీ పాదపీఠం… కర్పూర దీపం
చేరనీ నీ పాదపీఠం… నా ప్రాణదీపం