Menu Close

Aalayamlo Praveshinchandi Lyrics In Telugu – Telugu Christian Songs

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Aalayamlo Praveshinchandi Lyrics In Telugu – Telugu Christian Songs

ఆలయంలో ప్రవేశించండి అందరూ
స్వాగతం సుస్వాగతం యేసు నామంలో
నీ బ్రతుకులో పాపమా కలతలా
నీ హృదయంలో బాధలా కన్నీరా
నీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం

ఆలయంలో ప్రవేశించండి అందరూ
స్వాగతం సుస్వాగతం యేసు నామంలో

దీక్ష స్వభావంతో… ధ్యాన స్వభావమై
వెతికే వారికంతా… కనబడు దీపము
యేసురాజు మాటలే… వినుట ధన్యము
వినుట వలన విశ్వాసం అధికమధికమై

ఆత్మలో దాహము తీరును రారండి
ఆనందమానందం హల్లెలూయా

ఆలయంలో ప్రవేశించండి అందరూ
స్వాగతం సుస్వాగతం యేసు నామంలో

ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై
జీవ వృక్షంబుగా ఫలియించాలని
పెదవితో పలికెదం… మంచి మాటలే
హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలే

నింపెదం నిండెదం… కోరేదం పొందెదం
ఆనదంమానందం హల్లెలూయా

ఆలయంలో ప్రవేశించండి అందరూ
స్వాగతం సుస్వాగతం యేసు నామంలో
నీ బ్రతుకులో పాపమా కలతలా
నీ హృదయంలో బాధలా కన్నీరా
నీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం

Aalayamlo Praveshinchandi Lyrics In Telugu – Telugu Christian Songs

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading