Menu Close

Aakashame Aakaramai Lyrics in Telugu – Sri Manjunatha


Aakashame Aakaramai Lyrics in Telugu – Sri Manjunatha

ఆకాశమే ఆకారమై
భూమియే విభూధియై
అగ్నియే త్రినేత్రమై
వాయువే చలనమై

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now

జలమే జగమెలు మందహాసమై
పంచభూతాధార ప్రపంచేశ్వర
విధాత విశ్వనాథ
భువి వేగాసే ఆ నాథుడే శ్రీ మంజునాథుడై

శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం
శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం

మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం
మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం

అమృతం కోరి క్షీర కడలిని చిలుక ఆవిర్భవించింది హాలాహలం
శంకరుని శంఖమున శుభకర తీర్థమైనది విషం
జీవరాసుల రక్షకే శివుడాయే విషానికి అంకుశం

ఓం నమః శివాయ
ఓం నమః శివాయ

పితరుల ఆత్మకు శాంతిని కుర్చగా
గంగను ధరకే తరలించా తపస్సును పూణే భగీరధుడు

సురగంగా వరగంగా ప్రళయంగా ఎగసెగసి ఉబికుబికి ఉరుకులిడి హోరెత్తేతి
అది విని అల్లాడేను భూమి
కాపాడ రావయ్యా స్వామి

కనులు ముడని నీకు ఓ శివయ్య
గంగానపగా గర్వపడి రాకయ్యా
తుళ్లిపడకే చాలు చెల్లవింకా
గంగ వెర్రులు తెలుసు దుకు ఇంకా
ఆదుకో కైలాస లింగ దూకవే ఆకాశగంగా

ప్రియాగంగా కనులెలా పొంగే
నిను ముడితే నా మనసుగిపోయే
ఆహ్వానం ఆహ్లాదం శివగంగ ప్రేమానుబంధం

రావే శివ సిరాచారిని ధన్యోస్మి ధన్యోస్మి స్వామి

హర వర ఎలారా సద శివ బ్రోవర
సఖి సతి పార్వతి ప్రియే ఇదే సమ్మతి

శాంతించరా శంకర అగన్మధుని బ్రోవర

లోక కళ్యాణమును కోరి శివుడు
పార్వతి కల్యాణ వరుడాయెను
సతికి తన తనువులో సగభాగమోసగి అర్ధనారీశ్వరుడాయె
నాద శివుడు వేద శివుడు నాట్య శివుడు

శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం
శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం

మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం
మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం

Aakashame Aakaramai Lyrics in Telugu – Sri Manjunatha

Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading