Menu Close

Aakasama Neevekkada Lyrics In Telugu – Vandemataram

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Aakasama Neevekkada Lyrics In Telugu – Vandemataram

ఆకాశమా నీవెక్కడా… అవని పైనున్న నేనెక్కడా
ఆకాశమా నీవెక్కడా… అవని పైనున్న నేనెక్కడా
ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా, ఆఆ
ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా… నిలువగలన నీ పక్కన
ఆకాశమా నీవెక్కడా… అవని పైనున్న నేనెక్కడా

నీలాల గగనాల ఓ జాబిలి
నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా..?
నీలాల గగనాల ఓ జాబిలి
నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా..?
ముళ్ళున్న రాళ్లున్న నా దారిలో
నీ చల్లని పాదాలు సాగేదెలా..?
నీ మనసన్నది… నా మది విన్నది
నిలిచి పోయింది ఒక ప్రశ్నలా
నిలిచి పోయింది ఒక ప్రశ్నలా..!!

ఆకాశమా, ఆ ఆ ఆఆ… లేదక్కడ
ఆకాశమా లేదక్కడా… అది నిలిచి ఉంది నీ పక్కన
వేల తారకలు తనలో ఉన్నా
వేల తారకలు తనలో ఉన్నా… నేలపైనే తన మక్కువ
ఆకాశమా లేదక్కడా… అది నిలిచి ఉంది నీ పక్కనా

వెలలేని నీ మనసు కోవెలలో
నను తలదాచుకోని… చిరు వెలుగునై
వెలలేని నీ మనసు కోవెలలో
నను తలదాచుకోని… చిరు వెలుగునై
వెనుతిరిగి చూడని… నీ నడకలో
నను కడదాక రాని… నీ అడుగునై
మన సహజీవనం… వెలిగించాలి లే
సమత కాంతులు… ప్రతి దిక్కున
సమత కాంతులు… ప్రతి దిక్కున

ఆకాశమా నీవెక్కడ… అది నిలిచి ఉంది నా పక్కన
వేల తారకలు తనలో ఉన్నా
వేల తారకలు తనలో ఉన్నా… నేలపైనే తన మక్కువ
ఈ నేలపైనే తన మక్కువ

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading