ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Aaha Yemi Ruchi Song Lyrics In Telugu – Egire Paavurama
ఆఆ… ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ… మోజే తీరనిదీ
తాజా కూరలలో రాజా ఎవరండీ
ఇంకా చెప్పాలా వంకాయేనండీ
ఆహా ఏమి రుచి… అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ… మోజే తీరనిదీ
అల్లం పచ్చిమిర్చీ శుచిగా నూరుకునీ… ఈ ఈ
ఆ ఆ ఆఆ… దానికి కొత్తిమీరీ బాగా తగిలిస్తే
గుత్తొంకాయ కర్రీ ఆకలి పెంచు కదా
అది నా చేతుల్లో అమృతమే అవదా
ఒండుతూ ఉంటేనే రాదా
ఘుమఘుమ ఘుమఘుమ ఘుమఘుమలు
ఆహా ఏమి రుచి …అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ
లేత వంకాయలతో వేపుడు చేసేదా
మపదా దనిసరీ రీదా రీదా గారీసా నిసదాపా
మెత్త వంకాయలతో చట్నీ చేసేదా
టొమాటోతో కలిపీ వండిపెడితే మీరూ
అన్నమంత వదిలేసీ… ఒట్టి కూరా తింటారు
ఒకటా రెండా మరీ
వంకాయ లీలలు తెలియగ తెలుపగ తరమా
ఆఆ… ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ
తాజా కూరలలో రాజా ఎవరండీ
ఇంకా చెప్పాలా వంకాయేనండీ, ఆహా ఆఆ