ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఓ… ఆగి ఆగి సాగే మేఘమేదో
నన్ను తాకేనా ఒక్కసారే
నేల వీడి కాళ్లు నింగిలోకి తేలేనా
ముందులేని ఊహలేవో… రాలేను చినుకులాగా
అంతసేపు ఊపిరాగగా… ఆఆ
ఆ ఆపైనే మరో తీరం నే చేరగా
ఆశేమో వదిలి దూరం… నిజం అయ్యే క్షణం
హ్మ్ హ్మ్ హ్మ్ హు… హ్మ్ హ్మ్ హ్మ్ హు
ఓపలేని వేసవేదో… వేలు తాకగా
ఓ… కాగితాన నేను రాయగా… అదే క్షణాన
ఇదేది ముందు చూడనంత… కన్నుల్లో సంబరంలా
మరెంత ఉన్న చాలనంత… బంధించే పంజరంలా
నిశీధి దారిలోన ఎండే… ముఖాన్ని తాకుతూనే ఉండే
ముందే రాగరూపం నాపైన… ఓ పూల వాన ఆ చూపేనా, ఓ ఓ
ఆపేనా నే తీసుకోగా ఊపిరైనా
ఓసారే వచ్చిందే… నా గుండెలోకి గుండెపోటులా
ఓ.. ఆపైన మరో తీరం… నే చేరగా
ఆశేమో వదిలి దూరం… నిజం అయ్యేం క్షణం
హ్మ్ హ్మ్ హ్మ్ హు… హ్మ్ హ్మ్ హ్మ్ హు
రమారమీ జీవితం… అమాంతమే మారే
స్నేహం అనే మారుతం… ఇటేపుగా వీచే
మీరు మెల్లంగా… నీవు అయ్యేనా
ఇంకేదైనా పేరుందా… కాలమేమో వేడుకున్నా ఆగదు
వేళ్ళ మీద వీగిపోగా… నీ తోడులేక కాస్తయినా కదులదు
తానుంటే అంతేలే… ఇంకేది గురుతు రాని వేలలో
పోతుంది కరిగే దూరం… ఆ జంట నడుమ
పెంచావు ఎదలో వేగం… యే యే
ఔతోంది త్వరగా గారం… నీ కంట పడినా
తెంచావు దిగులు దారం నీవే
హ్మ్ హ్మ్ హ్మ్ హు… హ్మ్ హ్మ్ హ్మ్ హు
ఆగి ఆగి సాగే మేఘమేదో… నన్ను తాకేనా ఒక్కసారే
ఓ.. నేల వీడి కాళ్లు నింగిలోకి తేలేనా
ఓ.. అంతే లేని సంతోషాలే… వంతే పాడి వాలేలే
బాధే చేరే వీలింకా లేనే లేదే… తోడే ఉంటే మేలే
అంతే లేని సంతోషాలే… వంతే పాడి వాలేలే
నీడే తీసే రాగాలు మేలే మేలే… వచ్చే లేని ప్రేమే