Menu Close

Aadaallu Meeku Joharlu Lyrics in Telugu


Aadaallu Meeku Joharlu Lyrics in Telugu

హే లక్ష్మమ్మో పద్మమ్మో
శాంతమ్మో శారదమ్మో
గౌరమ్మో కృష్ణమ్మో
నా బాధే వినవమ్మో

ఈ గోలే ఏందమ్మో
ఈగోలే చాలమ్మో
ఓలమ్మో ప్లీజమ్మో
నా బతుకే బుగ్గయ్యేనమ్మో

నీ మొగుడేమన్నా మహేష్ బాబా
పోనీ అందానికేమైనా బాబా
చైలా..! కాపురం చైలా
కన్లా..! ఇద్దర్ని కన్లా

పోనీ నువ్వేమన్నా కత్రీనా కైఫా
నీ చూపేమన్నా గుచ్చే నైఫా
కానీ, చైలా..! కాపురం చైలా
మీరు కన్లా..! ముగ్గుర్ని కన్లా

మీరేమో మొగుళ్ళు సాయంత్రం తెచ్చేటి
పూలన్నీ జళ్ళోన ముడిసేత్తారా
నాకేమో ఏ పూలు లేకుండా సేసేసి
ఫూల్లాగ మడిసెత్తారా..?

ప్రతి మొగాడి విజయం వెనక
ఆడది ఉంటది అంటారు
కానీ నా విజయాన్ని
చెడగొట్టడానికి ఎందరు ఆడాల్లో

ఆడాళ్ళు మీకు జోహార్లు
ఆడాళ్ళు మీకు జోహార్లు

సినిమాకెళ్తే నా ఏజ్ ఫ్రెండు
పెళ్ళాన్ని తీసుకురాడా
వాడు నన్నే చూసి
సెల్లమ్మేదని అనడా, మరి అనడా

సాయంత్రమైతే సందు శివర
పువ్వుల కొట్టు సుబ్బన్న
మల్లెలు తీసుకెళ్ళి సెల్లెలుకిమ్మని
వెయ్ డా, జోకులు వెయ్ డా

మీరేమో మీ మొగుడు ఏ పనికి వెళ్తున్నా
సిరునవ్వులొలికించి ఎదురొత్తారా
నాకేమో ఎదురొచ్చే అవకాశం ఏ పిల్లకి
ఇవ్వనియ్యకుండా ఆపెత్తారా

ఎదురింట్లోన ఎంకయ్య తాతకి
ఇద్దరు పెళ్ళాలు
అరె, లేనే లేదు నా తలరాతకి
సింగిలు ఇల్లాలు

ఆడాళ్ళు మీకు జోహార్లు
ఆడాళ్ళు మీకు జోహార్లు

ముద్దులతోటి నిద్దుర లేపే
పెళ్ళాం కావాలని ఉండదా
డిన్నరు పెట్టి డ్రీమ్స్ లోకి
నెట్టే డ్రీమ్ గర్ల్ నాకు కావాలని పించదా

తన ఒళ్ళో వాలి ఓటీటి చూడాలి
అని నాక్కుడా ఉండదా
ఆకలి వేస్తే తనకో ఆమ్లెట్
వేయాలనిపించదా, నాకనిపించదా

మీరేమో మీ మొగుడు పండక్కి
కొని తెచ్చే చీరల్ని చుట్టేసి తిరిగేత్తారా
నేనేమో ఓ పట్టు సీరైనా కొనకుండా
నా పెళ్లి హాంఫట్టు సేసేత్తారా

అరె గంతకి తగ్గ బొంతని సామెత
మీరే సెబుతారే..!!
నా రేంజికి తగ్గా పిల్లని తెస్తే
ఓకే చెప్పరే..!!

ఆడాళ్ళు మీకు జోహార్లు
ఆడాళ్ళు మీకు జోహార్లు, హ

Aadaallu Meeku Joharlu Lyrics in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading