ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Aa Raaje Naa Raaju Song Lyrics in Telugu – Christian Songs Lyrics
ఆ రాజే నా రాజు – నా రాజే రారాజు
నా రాజు రాజులకు రాజు (2)
యేసు పుట్టెను ఈ లోకంలో
ఆనందమే గొప్ప ఆనందమే (2)
ఆనందమే గొప్ప ఆనందమే
సంతోషమే సర్వలోకమే (2) ||ఆ రాజే||
యెష్షయి మొద్దున – దావీదు చిగురుగా
లోక రక్షకుడు జన్మించెను
లోక పాపాలను కడిగి వేయగా
భువిలో బాలుడిగా అరుదించెను (2)
పరిశుద్ధాత్మ మూలముగా జన్మించెను
మన పాపాలకు విరుగుడు మందును (తెచ్చెను) (తెచ్చి అందించెను) (2) ||ఆనందమే||
వీనుల విందుగా – దీనుల అండగా
కరుణా కారకుడు కడలివచ్చెను
పాపుల శాపాలను తానే మోయగా
పరమ పాలకుడు పుడమి చేరెను (2)
కుల మత బేధాలను హరియించ వచ్చెను
పరలోకానికి చేర్చే (మార్గమాయెను) (మార్గమై తనే నిలిచెను) (2) ||ఆనందమే||
పాట రచయిత: బన్ని సుదర్శన్
Aa Raaje Naa Raaju Song Lyrics in Telugu – Christian Songs Lyrics